తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

అమ్మాయిలు.. అలసటగా ఉంటోందా? - హెల్త్ టిప్స్

ప్రస్తుత బిజీబిజీ జీవితంలో అమ్మాయిలు/మహిళలు అలసటగా ఎక్కువగా ఉంటోంది. అయితే సమతుల ఆహారంతో దీనిని అధగమించి, హుషారుగా మారొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

the causes of women's fatigue and reduce this with food
అమ్మాయిలు

By

Published : Aug 27, 2021, 8:23 AM IST

కాలంతో పరుగులు, ఒకేసారి ఎన్నో పనులు.. మహిళలకు సాధారణమే! ఫలితంగా అలసిపోతుంటారు. దీనిపై ఆహార ప్రభావమూ ఉంటుందట. అదేంటో చూసి తగ్గ మార్పులు చేసుకోవాలి మరి!

అల్పాహారం: చాలామంది మహిళలు పనిలో పడి దీన్ని మానేస్తుంటారు. లేదా హడావుడిగా ఏదో ఒకటి తినేస్తుంటారు. రెండూ తప్పే. లేచిన రెండు గంటల్లోపు బ్రేక్‌ఫాస్ట్‌ తప్పక చేయాలి. దానిలో చక్కెరలు తక్కువ, ఫైబర్‌ ఎక్కువ ఉండాలి.

ప్రొటీన్‌: రక్తంలో చక్కెరలు తగ్గడమే నీరసం, అలసటకు ప్రధాన కారణం. కొన్ని సమయాల్లో ఉత్సాహం, కొన్నిసార్లు మరీ నీరసం గమనిస్తుంటాం. అందుకే ఆహారంలో ప్రొటీన్లను ఎక్కువగా చేర్చుకోండి. ఇవి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. గోధుమ, ముడి బియ్యం, నట్స్‌, విత్తనాలు, ఓట్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. ఐరన్‌ శాతం తగ్గడమూ అలసటకు కారణమవుతుంది. దీన్ని పెంచుకోవాలంటే ఆకుకూరలు, కూరగాయలు, మాంసానికి ప్రాధాన్యమివ్వాలి. వైద్యుల సలహాతో సప్లిమెంట్‌నూ వాడొచ్చు.

దూరం: రిఫైన్డ్‌, నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి. తక్షణ శక్తికి, చురుకుదనానికి కాఫీ, టీలపై ఆధారపడుతుంటారు. కానీ వీటిలో ఉండే కెఫిన్‌ శరీరంలో చాలా సేపు నిల్వ ఉండి నిద్రపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, పరిమితంగా తీసుకోవాలి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details