తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ప్రశాంతమైన నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు! - నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు!

చాలా మంది నిద్రలేచినప్పటి నుంచి ఎన్నో పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. కానీ.. నిద్రకు మాత్రం తగినంత సమయం కేటాయించలేరు. ఫలితంగా.. మరుసటి రోజు చేసే పనులపై ఆ ప్రభావం కనిపిస్తుంటుంది. టైమ్​ దొరికినా సరిగా నిద్రపట్టని పరిస్థితి మరి కొందరిది. అయితే.. ఒత్తిడిని చిత్తు చేస్తూ ప్రశాంతంగా నిద్ర పోయేందుకు కొన్ని గ్యాడ్జెట్లు ఉన్నాయి. అవేంటంటే..

THE BEST SLEEPING GADGETS
నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు

By

Published : Oct 23, 2020, 8:37 PM IST

ఉరుకుల పరుగుల జీవితం. ఉదయం నుంచి రాత్రి వరకూ ఎన్నో పనులు. దాంతో చిరాకు, ఒత్తిళ్లు. మరి ఒత్తిడిని చిత్తు చేస్తూ మరో రోజుని ఉత్సాహంగా ప్రారంభించాలంటే.. శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం. అందుకే నిద్ర. మరి మీరెంత వరకు ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. ఓసారి మీ గాఢ నిద్రకి ఉపయోగపడే ఈ గ్యాడ్జెట్స్‌పై ఓ లుక్కేయండి. అవసరమనుకుంటే ఇంటికీ తెచ్చేయండి.

ఏ వేళలో అయినా..

ఏ వేళలో అయినా..

తీరికలేని సమయం.. ఉదయం, రాత్రి తేడా తెలియని పని వేళలు. ఏ సమయంలో నిద్రిస్తామో.. ఎప్పుడు లేస్తామో చెప్పలేని పరిస్థితి. మరి మీరే సమయంలో నిద్రించినా మీ గది వెలుతురు నిద్రకి అనుకూలంగా మార్చేస్తే.. అందుకే ఈ లైట్. పేరు 'Nox Sleep Light‌'. దీనితో మీ గది వెలుతురుని మీకు నచ్చినట్లుగా మార్చేయొచ్చు. బెడ్‌రూంలోకి వెళ్లి కాసేపు పుస్తకం చదివేద్దామంటే బ్రైట్‌నెస్‌ మోడ్‌లో పెట్టొచ్చు. నిద్రొస్తే తగ్గించేయొచ్చు. త్వరగా నిద్రలోకి జారుకునేలా మంచి మ్యూజిక్‌ కూడా ప్లే చేస్తుంది. ప్రకృతి శబ్దాలతో నిద్రలేపుతుంది. అంతేకాదు మీరెంత సమయం నిద్రిస్తున్నారో ట్రాక్‌ చేస్తుంది. నిద్రించేప్పుడు శ్వాసక్రియ, హృదయ స్పందనలపై ఓ కన్నేసి ఉంచుతుంది.

మరింత హాయిగా..

మరింత హాయిగా..

ప్రశాంతంగా నిద్రించాలంటే పడుకునే ప్రదేశం ఎంతో ముఖ్యం. అందుకు ఎన్నో రకాల బెడ్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. ఇదో స్మార్ట్‌ బెడ్. పేరు 'Bryte‌'. కృత్రిమ మేధస్సుతో పని చేస్తుంది. నిద్రించే సమయంలో మీ గదిలో నిద్రకి అనుకూలమైన వెలుతురు, వాతావరణాన్ని సృష్టిస్తుంది. నిద్రలో మీ కదలికలను అంచనా వేస్తూ మీ నిద్రకి ఆటంకం కలగకుండా సౌకర్యంగా పడుకునేలా చూస్తుంది. చల్లగా లేదా వేడిగా మీకు నచ్చిన విధంగా మీరే బెడ్‌ ఉష్ణోగ్రతని సెట్‌ చేసుకోవచ్చు. ఆ తరువాత మీ నిద్రకు అనుకూలంగా దానికదే ఉష్ణోగ్రతని మార్చేసుకుంటుంది. నెమ్మదిగా ప్రశాంతమైన నిద్రలోకి జారుకునేలా చేస్తుంది.

వింటూ పడుకోండిలా..

వింటూ పడుకోండిలా..

మీరు పడుకున్నప్పుడు దిండును ఉపయోగిస్తారా? అయితే ఈ స్మార్ట్‌ తలగడ మీకోసమే ప్రయత్నించండి. ఇదో బ్లూటుత్‌ స్పీకర్‌ పిల్లో. పేరు 'Soundasleep'. దీన్ని ప్రత్యేక యాప్‌ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కి జత చేస్తే చాలు. మ్యూజిక్‌, ఆడియో బుక్స్‌ వినేయొచ్చు. ఒత్తిడిని తగ్గించే యోగా, రిలాక్స్‌ మ్యూజిక్‌ వంటి నచ్చిన సంగీతాన్ని ప్లే చేసి తలకింద పెట్టేసి ప్రశాంతంగా కునుకేయొచ్చు. అంతేకాదు.. యాప్‌ల సాయంతో వివిధ భాషలు, వర్తమాన వ్యవహారాలు నేర్చుకోవచ్చు. స్మార్ట్‌ అలారం ద్వారా ప్రకృతి సిద్ధమైన ధ్వనులతో నిద్రలేవొచ్చు. దిండులో ఉన్న యూఎస్‌బీ కేబుల్‌తో ఛార్జ్‌ చేస్తే చాలు రోజంతా పనిచేస్తుంది.

నిద్రకు చిన్ని రోబో..

నిద్రకు చిన్ని రోబో..

మన గాఢ నిద్ర మన ప్రశాంతతపైనే ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి లేకుండా హాయిగా శ్వాసిస్తే చాలు సులువుగా మంచి నిద్రలోకి జారుకోవచ్చు. అలా మన శ్వాసను అంచనా వేస్తూ దాన్ని మెరుగుపరుస్తూ గాఢ నిద్రలోకి పంపే ఓ రోబో ఉంటే! అలాంటిదే ఇది. పేరు 'Somnox Sleep Robot'. నిద్రించే సమయంలో దీన్ని హత్తుకుని పడుకుంటే చాలు అది శ్వాసిస్తున్న భ్రమ కలుగుతుంది. దీంతో మీకు తెలికుండానే మీ శ్వాసక్రియ రేటు మెరుగవుతుంది. దీంతో ఒత్తిడిని తగ్గించి, మిమ్మల్ని విశ్రాంత దశలోకి పంపుతుంది. మంచి శబ్దాలు, హార్ట్‌బీట్‌లలో మిమ్మల్ని ప్రశాంత నిద్రలోకి పంపుతుంది. ప్రత్యేక యాప్‌ ద్వారా మీకు నచ్చినట్టుగా మార్పులు చేసుకోవచ్చు.

ఇదీ చదవండి:కంటికి నిద్ర తగ్గితే.. ఒంట్లో నీరూ తగ్గుతుంది!

ABOUT THE AUTHOR

...view details