ఎలాంటి సమస్యలు లేకుండా పెరుగుతున్న వయసును (Healthy Aging Tips) ఆహ్వానించాలంటే ఆనారోగ్యం వచ్చేవరకు ఆగకుండా ముందునుంచే వైద్యపరీక్షలు చేయించుకుంటుండాలి. ముఖ్యంగా కంటి, దంత వైద్యులను క్రమం తప్పకుండా కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ముందుగానే వైద్యపరీక్షలు చేయించుకోవడం వలన వ్యాధులను తొలిదశలోనే గుర్తించవచ్చు లేదా వాటిని రాకుండా నివారించొచ్చు. కుటుంబ వైద్య చరిత్ర, వయసు, వ్యాయామం చేస్తారా? లేదా? అనే అంశాల ఆధారంగా.. ఏ టెస్టులు ఎంత తరుచుగా చేయించుకోవాలనేది వైద్యులు సూచిస్తారు. వయసు పెరుగుతున్న కొద్ది కొన్ని అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. అధిక రక్తపోటు, కొన్ని రకాల క్యాన్సర్లు, మధుమేహం, హెచ్చు కొలెస్ట్రాల్, ఎముకల వ్యాధులు రాకుండా ఆపేందుకు వైద్యుల సలహా మేరకు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
Healthy Aging Tips: వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా ఉండాలంటే?
వయసు పెరగడం అనేది అందరిలో ఉండేదే. కొందరు తక్కువ వయసులోనే ముసలి వారిలా కనిపిస్తుంటారు. వెంట్రుకలు తెల్లబడటం, ముఖం మీద ముడతలు మరీ ఎక్కువగా కనపిస్తుంటాయి. శరీరంలో శక్తి తగ్గిపోయి అనారోగ్య సమస్యలు సైతం చుట్టు ముడుతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మలివయసులోనూ యవ్వనంగా కనిపించొచ్చు!
వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా
ముసలితనంలోనూ ఆరోగ్యంగా ఉండాలంటే..
- వయసు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి పరంగా కొన్ని మార్పులు వస్తాయి. కొంతమందికి క్రమక్రమంగా నశిస్తుంది. ఇందు కోసం డాక్టర్ సలహా మేరకు మందులు ఉపయోగించాలి.
- తినే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలి. దంపుడు బియ్యం, బ్రౌన్ రైస్, ఓట్స్, ఆకుకూరలు, పీచు పదార్థాలు ఉండేవి ఎక్కువ తీసుకోవాలి.
- పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ముసలితనంలో వచ్చే అజీర్తి సమస్యకు చెక్ పెట్టవచ్చు.
- పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, గింజలు, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
- ఎక్కువ కొవ్వు ఉన్న మాంసాహారాలు, చక్కెర, ఉప్పు తగ్గించి తీసుకోవాలి. ఇలా ఆహారం విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఎక్కువ కాలం జీవించడమే కాకుండా.. గుండె జబ్బులు, చాలా రకాల క్యాన్సర్లు, అల్జీమర్స్ లాంటి వ్యాధులు రాకుండా నిరోధించవచ్చు.
- ప్రతిరోజూ అరగంట నడవటం వలన మెదడుకు మరింత రక్తం, ఆక్సిజన్ అందుతాయి. నడకతో బరువు అదుపులో ఉంటుంది. అంతేగాకుండా మానసిక సమస్యలను అదుపులో ఉంచుకొవచ్చు. ఎముకలు కండరాలు మరింత బలంగా మారుతాయి. నిద్ర బాగా పడుతుంది.
- వయసు పైబడిన వారిలో ఆస్ట్రోపొరోసిస్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజుకు ఒక గ్రాము క్యాల్షియం, విటమిన్ డీ కూడా అవసరం ఉంటుంది. వీటి కోసం నడకను ప్రారంభించాలి. దీనితో పాటు డ్రై ఫ్రూట్స్, పాలు, గుడ్డు, మాంసాహారం తినని వారు చేపలు తీసుకోవడం ద్వారా ఎముకలు బలంగా తయారవుతాయి.
- పొగ తాగడం, మద్యం సేవించడం లాంటి అలవాట్లు ఉంటే వాటిని తగ్గించుకోవడం చేయాలి.
- ముసలితనంలో ఉన్న వారు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు. అలా ఉంటే త్వరగా అనారోగ్యానికి గురవుతారు. వీటితో పాటు మానసిక సమస్యలు చుట్టుముట్టుతాయి. వీటి వల్ల బీపీ, షుగర్ వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి:Skin Tips: చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే చెడు అలవాట్లు ఇవే..!