తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

టైప్‌1 మధుమేహాన్ని ఆపే మందు! - టైప్‌1 మధుమేహాన్ని నివారించే తొలి టెప్లిజుమాబ్‌ మందు

టైప్1 మధుమేహం బారినపడకుండా ఉండేందుకు టెప్లిజుమాబ్‌ మందు తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఈ మందు తీసుకున్న వారిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి మెరుగవ్వటం గమనార్హం.

teplizumab-drug-to-prevent-type1-diabetes
టైప్‌1 మధుమేహాన్ని ఆపే మందు!

By

Published : Jun 29, 2021, 10:39 AM IST

టైప్‌1 మధుమేహం ముప్పు పొంచి ఉన్నవారికి శుభవార్త. త్వరగా దీని బారినపడకుండా కాపాడుకోవటానికి టెప్లిజుమాబ్‌ మందు తోడ్పడుతున్నట్టు తాజాగా బయటపడింది. ఇన్సులిన్‌ అసలే ఉత్పత్తి కాకపోవటం లేదూ తగినంత ఇన్సులిన్‌ లేకపోవటం వల్ల టైప్‌1 మధుమేహం తలెత్తుతుంది. ఇది పిల్లల్లో ఎక్కువైనప్పటికీ ఏ వయసులోనైనా రావొచ్చు. కాకపోతే పెద్దవారిలో అరుదు. తల్లిదండ్రులు, తోబుట్టువుల్లో ఎవరికైనా టైప్‌1 మధుమేహం ఉంటే దీని ముప్పు ఎక్కువ. తల్లిదండ్రులిద్దరూ మధుమేహులైతే ముప్పు ఇంకాస్త పెరుగుతుంది.

ఇలాంటివారికి టెప్లిజుమాబ్‌ ఉపయోగపడుతున్నట్టు, జబ్బు బయటపడటం రెండున్నరేళ్లు ఆలస్యమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరిలో ఇన్సులిన్‌ ఉత్పత్తి మెరుగవ్వటం గమనార్హం. ఒక కోర్సు మందుతోనే దీర్ఘకాలం పాటు ప్రయోజనాలు కనిపిస్తున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. దీని వాడకానికి అనుమతి లభిస్తే టైప్‌1 మధుమేహాన్ని ఆలస్యం చేసే లేదా నివారించే తొలి మందు ఇదే కాగలదు.

ఇదీ చూడండి:Dharani Portal: భూ సమస్య ఏదైనా ఇక ఫిర్యాదు సులువు

ABOUT THE AUTHOR

...view details