Reasons for Teeth Breaking in Telugu :దంతాలు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి. డెంటైన్ అనే పదార్థంతో ఇవి తయారవుతాయి.ఆహారాన్ని నమిలేందుకు, త్వరగా జీర్ణం కావడానికి దంతాలు ఎంతగానో ఉపయోపడతాయి. ఇంతటి ముఖ్యమైన పనులను నిర్వర్తించే దంతాలు కొన్ని సార్లు విరిగిపోతుంటాయి. ఇలా దంతాలు విరిగిపోవడానికి ముఖ్యంగా ఐదు కారణాలున్నాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దంతాలు విరిగిపోవడానికి 5 ముఖ్య కారణాలు :
నోటి పరిశుభ్రత లేకపోవడం :చాలా మంది ఉదయాన్నే పళ్లు తోముకుంటే సరిపోతుందని అనుకుంటారు. కానీ, ఆరోగ్యవంతమైన దంతాలు ఉండాలంటే, రోజూ తప్పనిసరిగా రెండు సార్లు బ్రష్ చేయాలి. ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలని చెబుతున్నారు. దీని వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా క్లీన్ అయిపోయి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయని అంటున్నారు.
పళ్లు కొరకడం (బ్రక్సిజం) :చాలా మంది నిద్రపోతున్నప్పుడు పళ్లు కొరకడం సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారిలో దవడ పళ్లు ఒకదానితో ఒకటి ఢీకొని శబ్దం వస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగే వారిలో దంతాలు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రక్సిజం వల్ల దవడ నొప్పి, తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ప్రధానంగా పళ్లు కొరకడానికి ఒత్తిడి, ఆందోళన, కండరాల బలహీనతలు కారణాలని తెలిపారు. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, యోగా, స్పోర్ట్స్ వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే రాత్రి నిద్రపోయేటప్పడు మౌత్‌గార్డ్‌లు, దంతాల మధ్య చిన్న ప్లాస్టిక్ చిప్స్ వంటివి పెట్టుకోవాలని చెబుతున్నారు.
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!