తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

women health tips: ఆ సమయంలో విశ్రాంతి అవసరం

మహిళలకు నెలసరి సమయంలో లేదా అది దగ్గర పడుతున్న సమయంలో కాస్తంత చిరాగ్గా ఉంటుంది. ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

menstruation time
నెలసరి సమస్య

By

Published : Sep 16, 2021, 7:12 AM IST

నెలసరి దగ్గర పడుతున్న కొద్దీ చాలామందిలో ఆందోళన, చిరాకు పెరుగుతాయి. ముఖ్యంగా ఆ రోజుల్లో కొందరు మహిళలు మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు పడతారు. కొన్ని చిట్కాలతో ఆ నెలసరి బాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందొచ్చు. ఎలానో తెలుసుకుందామా..

* ఆ సమయంలో నిద్రకు, విశ్రాంతికి వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.

* వేడి వేడిగా పాలు లేదా చమోలీ, అల్లం, గ్రీన్‌ టీ తాగితే ఉపశమనంగా ఉంటుంది. ఈ సమయంలో కెఫిన్‌ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే ఆహారంలో పిండి పదార్థాలు, చక్కెర, ఉప్పులను తగ్గించాలి. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. పోషకాలుండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వాటిలోని యాంటీఆక్సిడెంట్లు మేలు చేస్తాయి.

* పెద్ద పెద్ద కసరత్తులు వద్దు. శ్వాసకు సంబంధించిన వ్యాయామాలపై దృష్టి పెట్టాలి.

* వీలైతే ఓ నోటు పుస్తకంలో ఆ సమయంలో మీకు కలిగే ఆలోచనలను రాయండి.

* ఇష్టమైన సినిమానో, కార్టూనో చూడండి. నచ్చిన పుస్తకం చదవండి. గోరువెచ్చటి నీటితో స్నానం మీ ఒంటి నొప్పుల నుంచి ఉపశమనాన్ని కలగజేస్తుంది.

* ఆ టైమ్‌లో ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల శరీరం ఊరికే నీరసించి పోదు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details