Sweet Potatoes Benefits in Telugu:మొరంగడ్డ, చిలగడ దుంప, స్వీట్ పొటాటో.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పేరు ఏదైనా, ఆహారప్రియులకు ఎంతో ప్రీతికరమైన దుంపలివి.నోటిలో పెట్టుకోగానే.. తియ్యగా కరిగిపోయే ఈ దుంపలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. ఇందులో పిండి పదార్థాలతోపాటు చక్కెర శాతంగా కూడా ఎక్కువే. ఈ దుంప శరీరానికి బోలెడన్ని పోషకాలను అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
సాధారణంగా చిలగడ దుంపలు ఎరుపు, గులాబీ రంగులో ఉంటాయి. ఇవి ఎక్కువ చలికాలంలో అందుబాటులో ఉంటాయి. రుచిగా ఉండే వీటిని.. కొంతమంది పచ్చిగా తింటే.. మరి కొంత మంది ఉడకబెట్టి తింటారు. సాయంత్రం వేళ స్నాక్ లాగా చిలగడ దుంపలను తీసుకుంటారు. మరి ఈ దుంపలో ఉన్న ప్రయోజనాలను ఇప్పుడు చూద్దాం..
చిలగడ దుంపలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు:
Sweet Potato Health Benefits:
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది..:చిలగడ దుంపలను రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. వీటిని శుభ్రంగా కడిగి ఉడకబెట్టిన తరవాత తొక్క తీసేసి, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో తినవచ్చని చెబుతున్నారు. బ్రేక్‌పాస్ట్‌లో తినడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. వీటిలో పిండి పదార్థం.. కడుపు నిండిన భావనను కలిగిస్తుందంటున్నారు.
కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది :చిలగడ దుంపల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చెయ్యడమే కాదు.. దాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయని అంటున్నారు.