Sweet Corn Health Benefits in Telugu : ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవన శైలితో పాటే ఆహార అలవాట్లలో భారీగా మార్పులు జరుగుతున్నాయి. దీంతో డయాబెటిస్, గుండె సమస్యలు వంటి దీర్ఘకాలిక వ్యాధులు, కంటి సమస్యలు, అధిక బరువు ఇలా రకరకాల ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కొందరు.. వీటన్నింటి బారిన పడకుండా ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు. అయితే మనం రోజూ వారీ ఆహారంలో స్వీట్‌కార్న్ చేర్చుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరవని అంటున్నారు.
Benefits Of Sweet Corn In Telugu
స్వీట్‌కార్న్ ఉపయోగాలు..
1. పోషకాలు
స్వీట్‌కార్న్‌లో సరైన మోతాదులో ఫైబర్ (పీచు పదార్థం) సహా మన శరీరానికి కావాల్సిన అనేక రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయి. విటమిన్ ఏ, బీ-కాంప్లెక్స్, సీతో పాటు పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు.. స్వీట్‌కార్న్‌లో పుష్కలంగా ఉంటాయి.
2. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు
స్వీట్‌కార్న్‌లో లుటీన్, జియాక్సాంటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ల ఉంటాయి. ఇవి వయసు పైబడుతుంటే వచ్చే కంటి సంబంధిత వ్యాధులను నిరోధించడంలో సహాయపడుతాయి.