తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

శృంగారంలో ఆ హార్మోన్స్​ పాత్ర ఏంటి? - శృంగారంలో ఫీల్​ గుడ్​ హార్మోన్స్​

Feel Good Hormones: శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ చేయడం వల్ల.. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య శృంగారం హాయితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనికి గల కారణం ఏంటో తెలుసుకుందాం.

feel good hormones
శృంగారంలో ఆ హార్మోన్స్​ పాత్ర ఏమిటి?

By

Published : Jan 30, 2022, 7:50 AM IST

Feel Good Hormones: పురుషుల్లో అయినా, మహిళ్లలో అయినా వయసు వచ్చిన తరువాత కామ కోరికలు పెరగడం అనేది సర్వసాధారణం. అయితే వారిలో లైంగిక సమస్యలు రాకుండా.. సామర్థ్యం బాగుండాలంటే ఆరోగ్యంగా ఉండాల్సిందే. శృంగార సామర్థ్యం తగ్గింది అంటే మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా కామకోరికలు కలగలేదన్నా.. శృంగారం పట్ల విముకత చూపిస్తున్నా.. ఆడవారిలో శృంగార సమస్యలు ఉన్నట్లే. దాని వల్లే వారిలో రతిపై ఆసక్తి సన్నగిల్లుతుంది. మరి అలాంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ.. రతిని అనుభవించాలంటే ఏం చేయాలి? ఎలా వారి లైఫ్​లో ఆనందాన్ని సొంత చేసుకోవాలనే ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.

భార్యాభర్తల మధ్యన ఉండే శృంగారం.. హాయిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిలో ప్రధాన పాత్ర పోషించేవి ఫీల్​గుడ్​ హార్మోన్స్​ (Feel Good Hormones). వీటిని లవ్​ హార్మోన్స్​ అని కూడా అంటారు. మనిషి మంచి ఆనందకరమైన విషయాల్లో పాల్గొంటే.. ఫీల్​గుడ్​ హార్మోన్స్​ విడుదల అవుతాయి. ఇవి దంపతులు చాలా హుషారుగా, కావాలనే తపనతో పాల్గొంటే. డోపమిన్​ అనే హార్మోన్​ రిలీజ్​ అవుతుంది . డోపమిన్​ ఒకరకమైన మూడ్​ను ఎలివేట్​ చేసే హార్మోన్​. దంపతులు ఇద్దరు ఆలింగనం చేసుకున్నా.. సెక్సీగా మాట్లాడుకున్నా... శృంగ సంభాషణ చేసినా.. ఒకరిని ఒకరు చక్కగా మెచ్చుకున్నా.. ఈ హార్మోన్​ రిలీజ్​ అవుతుంది. డోపమిన్​ మనిషిని చాలా హాయిగా ఉంచుతుంది.

ఇలాంటి భావనలు కలిగించే మరో హార్మోన్​.. ఆక్సిటోసిన్​. ఇది బ్రెయిన్​లో నుంచి విడుదల అవుతుంది. ఈ హార్మోన్​ మనుషులను మరింత దగ్గర చేస్తుంది. సంతోషంగా, హాయిగా ఉంచుతుంది. ఎప్పుడైతే మనుషులు హుషారుగా ఉంటారో.. ఆ సమయంలో ఇమ్యునిటీ పెరుగుతుంది. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

ఈ ఫీల్​గుడ్​ హార్మోన్స్​ మనిషిలో ఇమ్యునిటిని పెంచడంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే దంపతుల మధ్య శృంగారం ఆరోగ్యాన్ని మంచి చేస్తుందని అంటారు. ఈ రొమాంటిక్​ ఫీలింగ్స్​, రొమాంటిక్​ టచ్​ ఉండాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు.

  • సెక్స్​లో ఎక్కువ తృప్తి చెందేది ఎవరు? మహిళనా? పురుషుడా?
  • చక్కటి శృంగార అనుభూతిని పొందడానికి మహిళ జననేంద్రియాల్లోని రహస్యం ఏంటి?
  • వయసు పైబడి మహిళల్లో దాంపత్య సుఖం ఎలా ఉంటుంది?
  • సెక్స్​లో డిప్రిషన్​ వచ్చిన వారు మందులు వాడాలా?
  • శృంగారంలో పాల్గొన్నప్పుడు మహిళ జననాంగాల్లో ఎందుకు మంటగా ఉంటుంది?
  • ఆంటీలతో శృంగారం అనర్థదాయకమా?
  • బోదకాలు వచ్చిన మహిళతో సెక్స్​ చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా?
  • సంసారంలో ఎదుటి వ్యక్తిని ఏడిపించి.. సంతోషించే వారిని మార్చవచ్చా?
  • నవదంపతుల మధ్య ముద్దులకు, కౌగిలింతలకు ఉండే ప్రముఖ్యత ఏంటి?

పై వాటి గురించి తెలుసుకోవాలంటే కింద ఇచ్చిన లింక్​ ని ఓపెన్ చేయండి

ఇదీ చూడండి:మహిళలకు గర్భకోశంలో కాకుండా మరో చోట గర్భం వస్తుందని తెలుసా?

ABOUT THE AUTHOR

...view details