రాగి.. పురాతన లోహాల్లో ఒకటి. బోలెడన్ని సద్గుణాలు ఉండటం వల్ల బంగారం, వెండితో పాటు దీన్ని మన జీవితంలో భాగస్వామ్యం చేశారు పూర్వీకులు. ఈ లోహం శరీర ఎదుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. కంటికి కనిపించని క్రిములను చంపడంలో కీలకంగా వ్యవహరించే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని ఎన్నో ఏళ్లుగా ప్రజలు విశ్వసిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్, మిరియాలు, యీస్ట్‌లో ఉండే గుణాలు.. రాగిలో ఉంటాయని వైద్య పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాగిని ఎక్కువగా ఉంగరం రూపంలో ఆభరణంగా ధరిస్తారు. అలా చేస్తే లాభాలేమిటో ఓ సారి చూద్దాం..
వ్యాధి నిరోధక శక్తి: రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఈ లోహం సొంతం. శరీరంలో రక్తప్రసరణను క్రమపరుస్తుంది. హానికలిగించే ఇతర రసాయనాలు, లవణాల నుంచి అవయవాలను రక్షిస్తుంది.
గుండెకు రక్షణ : గుండెపోటు, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న హృద్రోగ సమస్యలకు చెక్ పెడుతుంది. శరీరంలో కొల్లాజెన్, ఎలాస్టిన్, ఫైబర్‌ను మెరుగుపరుస్తుంది.
రక్తపోటు అదుపులో: శరీరంలో రక్తపోటును నియంత్రిస్తుంది. రక్తహీనత సహా పలు రక్త సంబంధిత వ్యాధుల నుంచి సాంత్వన కలిగిస్తుంది.