Summer Tips for Diabetic People: ఎండలు మండిపోయే వేసవి సీజన్.. షుగర్ పేషంట్లకు కాస్త కష్టకాలమే. ఒంట్లోని నీరంతా చమట రూపంలో బయటకు వెళ్లిపోతుండటం వల్ల నీరు, లవణాల సమతూకం దెబ్బతింటుంది. దీంతో తరచూ డీహైడ్రేషన్, వడదెబ్బలకు లోనవుతుంటారు. నీరసం, నిస్సత్తువతో కూలబడుతుంటారు. ఫలితంగా రక్తంలో గ్లూకోజ్ శాతాలు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఈ పరిస్థితి ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవిలో ఎదురయ్యే ఈ ప్రత్యేక పరిస్థితులను తట్టుకునేందుకు షుగర్ బాధితులు జీవనశైలిలో ప్రత్యేకమైన మార్పులు చేసుకోవాలి.
వేసవిలో షుగర్ పెరగడానికి కారణం.. రక్తంలో 3 లీటర్ల వరకు నీరు బయటకు వెళ్లిపోవడం మూలానా.. రక్తం చిక్కబడుతుంది. దానివల్ల రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా కనబడుతుంటుంది. చమట ఎక్కువగా పట్టే ప్రదేశాల్లో సాధారణ పౌడర్ వాడటం.. వల్ల చర్మం పొడిగా అవుతుంది. తద్వారా బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారించుకోవచ్చు. ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే రక్తంలో గ్లూకోజ్ పెరుగుదలను కూడా నివారించుకోవచ్చు.