థైరాయిడ్ సమస్యలకు సంప్రదాయ చికిత్స ఇటీవలి కాలంలో జీవనశైలి సమస్యల చిట్టా అంతకంతకూ పెరుగుతోంది. ఒకప్పుడు పెద్దగా కనిపించని షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలు ఇప్పుడు అందరిలో కనిపిస్తున్నాయి. బీపీ, షుగర్లలాగే థైరాయిడ్ సమస్యలూ అందరినీ వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య కనిపిస్తోంది.
థైరాయిడ్ సమస్య రావడానికి గల ప్రధాన కారణం మనం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడమే. సరైన ఆహారం తీసుకోకపోవడం, హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వల్లే థైరాయిడ్ సమస్య వస్తుంది. అందుకని థైరాయిడ్ సమస్య అనేది కేవలం మందులతో కంట్రోల్ అవుతుంది అనుకోవడం తప్పు. మందులతో పాటు సరైన ఆహారం తీసుకోవడం అన్నది చాలా ప్రధానం. మన ఆహారపు అలవాట్లను మార్చుకోగలిగితే మందుల ప్రభావం త్వరగా కలిగి థైరాయిడ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.
"థైరాయిడ్ సమస్య అనేది ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ఇందులో అయితే లావు కావడం లేదంటే పలుచగా అవడం చూస్తుంటాం. థైరాయిడ్ అనేది మన శరీరంలో ఉన్న అన్ని రకాల ఎముకల ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. మన భావోద్వేగాలను కూడా ఇదే నిర్ణయిస్తుంది. అంతేకాదు, శరీరంలో అనేక వ్యవస్థలను ఇది నియంత్రిస్తుంది. థైరాయిడ్‌లో హైపో థైరాయిడిజం అని వింటుంటాం. ఇందులో గ్రాప్ డిసీజ్ అని ఒకటి వస్తుంది. ఇందులో కార్డియాక్ అరెస్ట్ లాంటివి కూడా సంభవిస్తుంటాయి. అందుకే హైపోథైరాయిడిజాన్ని తేలిగ్గా తీసుకోరాదు. ఈ థైరాయిడ్ సమస్యల్లో ప్రాణాయామం బాగా సాయం చేస్తుంది. ఉజ్జయి ప్రాణాయామం సరైన రీతిలో చేస్తే ఈ థైరాయిడ్ స్రావాలు చక్కగా ఉంటాయి. థైరాయిడ్ సమస్యల్లో ఉజ్జయి ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యల్లో ఆహారానికి కూడ ప్రధాన పాత్ర ఉంటుంది. ఆహార ప్రణాళికతో పాటు మేం మడ్ థెరపీ, దాంతోపాటుగా ప్రకృతి చికిత్సలోని కొన్ని పద్ధతుల్ని వాడి థైరాయిడ్ సమస్యల్ని నయం చేస్తుంటాం."
- డాక్టర్ అర్చన, సుఖీభవ వెల్నెస్ సెంటర్ డైరెక్టర్
థైరాయిడ్‌తో అనేక చిక్కులు
పెరిగే వయసులో పిల్లల్లో శారీరక ఎదుగుదలకు థైరాయిడ్ హార్మోన్లు చాలా దోహదపడతాయి. ముఖ్యంగా నాలుగేళ్లలోపు పిల్లలకు వారి మెదడు ఎదుగుదలకు, పరిపక్వతకు థైరాయిడ్ హార్మోన్లు చాలా అవసరం. థైరాయిడ్ సవ్యంగా ఉంటే పిల్లల్లో మెదడు చురుకుదనం పెంపొందుతుంది. పిల్లల్లో మానసిక ఎదుగుదల మాత్రమే కాకుండా వారి శారీరక ఎదుగుదలకు లైంగిక పరిపక్వతకు థైరాయిడ్ గ్రంధి ఎంతో సహాయపడుతుంది. థైరాయిడ్ సరిగ్గా పనిచేయనప్పుడు పిల్లల్లో ఎత్తు ఎదుగుదలకు, లైంగిక పరిపక్వతకు విఘాతం కలుగుతుంది. దీంతో పిల్లలు పొట్టిగా ఉండిపోవటం, వారికి 15 సంవత్సరాలు నిండినా కూడా పెద్ద వయస్సులో గల లైంగిక మార్పులు రాకపోవచ్చు. ఆడపిల్లల్లో 14 సంవత్సరాలు నిండినాకూడా నెలసరులు మొదలు కావు. మహిళల్లో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే నెలసరులు సరిగ్గా సమయానికి రాకుండా క్రమం తప్పే అవకాశం ఉంది. తద్వారా గర్భం దాల్చే అవకాశం తగ్గిపోతుంది. ఇలా థైరాయిడ్‌తో అనేక చిక్కులు వచ్చిపడతాయి.
జీవనశైలి దెబ్బతింటే వచ్చే సమస్యల్లో థైరాయిడ్ సమస్యలు కూడా ప్రధానమైనవే. ఒక్కసారి థైరాయిడ్ సమస్య వస్తే షుగర్ దగ్గర నుంచి, బరువు, నీరసం లాంటి అనేకానేక సమస్యలు వచ్చిపడతాయి. అందుకే తినే ఆహారం, వ్యాయామాలు, నిద్ర, ఒత్తిళ్లను తగ్గించేందుకు చక్కటి ప్రణాళిక అవసరం. అలాంటి చక్కటి జీవనశైలి ప్రణాళికను అందజేయడం సుఖీభవ వెల్నెస్ సెంటర్ సాయం తీసుకోవచ్చు.
థైరాయిడ్ సమస్యల్ని అదుపులో ఉంచుకోవడానికి మన జీవనశైలి, ఆహారపు అలవాట్లను గాడిలో ఉంచుకోవడం చాలా అవసరం. నిత్యం వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటి ప్రక్రియల సాయంతో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు థైరాయిడ్ గ్రంధిని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.
సుఖీభవ వెల్ నెస్ కేంద్రానికి సంప్రదించాల్సిన వివరాలు ఇదీ చూడండి: జీవనశైలిని గాడిలో పెట్టి.. రక్తపోటును అదుపులో ఉంచు..