తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఇయర్‌ఫోన్లు పెట్టుకుని హై వాల్యూమ్‌లో వింటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే! - హై వాల్యూమ్‌ వినికిడి సమస్య

ఇయర్​ఫోన్లు పెట్టుకుని హై వాల్యూమ్‌తో పాటలు వింటున్నారా? అయితే కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఇలా వినడం ద్వారా చెవులు దెబ్బతింటాయంటున్నారు నిపుణులు. వాల్యూమ్‌ విషయంలో దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Etv Bharat
ఇయర్‌ఫోన్లతో వినికిడి సమస్య

By

Published : Nov 25, 2022, 8:10 AM IST

Updated : Nov 25, 2022, 8:41 AM IST

ఇప్పుడు ఎవరి చెవుల్లో చూసినా ఇయర్‌ఫోన్లే. లేదూ ఇయర్‌బడ్స్‌, హెడ్‌ఫోన్లే. సంగీతం వినటం.. సినిమాలు, వినోద కార్యక్రమాలకు చూడటం ఎవరికి ఇష్టముండదు? ప్రయాణాలు చేస్తున్నప్పుడు మంచి కాలక్షేపం కూడా. కానీ ప్రతిదానికీ ఒక పరిమితి ఉంటుంది. మనం వినే చప్పుడుకూ ఇది వర్తిస్తుంది. ఇయర్‌ఫోన్ల వంటి సాధనాలతో హై వాల్యూమ్‌తో వినే అవకాశం చాలా ఎక్కువ. ఇది వినికిడిని దెబ్బతీస్తుంది. యుక్తవయసు పిల్లలు, యువతీ యువకుల్లో (12-34 ఏళ్లు) దాదాపు 24% మంది మితిమీరిన వాల్యూమ్‌తోనే సంగీతాన్ని వింటున్నారని అంతర్జాతీయ పరిశోధకుల బృందం గుర్తించింది.

దీంతో దాదాపు 100 కోట్ల మంది వినికిడి లోపం బారినపడే ప్రమాదముండటం గమనార్హం. ఎక్కువ శబ్దంతో ఒకసారి విన్నా, మాటిమాటికి విన్నా చెవుల్లో వినికిడి వ్యవస్థ దెబ్బతింటుంది. చెవుల్లో రింగు మనే మోత వినిపించొచ్చు. వినికిడి తీరూ మారిపోవచ్చు. చిన్న వయసులో వినికిడి వ్యవస్థ దెబ్బతింటే వయసుతో పాటు తలెత్తే వినికిడి లోపం ముప్పు మరింత ఎక్కువవుతుంది. కాబట్టి వాల్యూమ్‌ విషయంలో అంతా దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Last Updated : Nov 25, 2022, 8:41 AM IST

ABOUT THE AUTHOR

...view details