Spices For Weight Loss :ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ వేధిస్తున్న ప్రధానమైన సమస్య ఊబకాయం. దీనిని తగ్గించుకునేందుకు చాలా మంది విశ్వప్రయత్నాలు చేసి.. చివరికి నిరాశ చెందుతుంటారు. అయితే ఈ సమస్యకు.. మన వంటింట్లో ఉన్న సుగంధ ద్రవ్యాలతోనే చెక్ పెట్టవచ్చని మీకు తెలుసా? వాస్తవానికి మసాలా దినుసులు శరీర జీవక్రియలను మెరుగుపరచి, మనం త్వరగా బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి. మరి ఆ సుగంధ ద్రవ్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా?
దాల్చిన చెక్క!
Cinnamon :దాల్చిన చెక్క(Cinnamon)లో అనేక యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని జీవక్రియల వేగాన్ని పెంచుతాయి. సహజంగా మనకు వేసే ఆకలిని కంట్రోల్ చేసే గుణాలు ఈ దాల్చిన చెక్కలో ఉన్నాయి. కనుక శరీర బరువు అనేది క్రమంగా తగ్గుతుంది.
కాయెన్ పెప్పర్(మిర్చీ)!
Cayenne Pepper : కాయెన్ పెప్పర్(మిర్చీ)లో ఉండే మండే స్వభావం మీ ఆకలిని తగ్గిస్తుంది. దీనిని మీరు పొడి రూపంలో లేదా కాయ రూపంలో కానీ తీసుకోవచ్చు. దీనిని మీ కడుపు కూడా త్వరగా అరిగించేసుకుంటుంది. ఇది మన శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వీటికి అదనంగా ఈ కాయెన్ పెప్పర్లో ఉండే క్యాప్సైసిన్లోని థర్మోజెనిక్ లక్షణాలతో మన బాడీలోని ఫ్యాట్‌ను సులువుగా కరిగించుకోవచ్చు.
సోంపు గింజలు!
Fennel Seeds :సోంపు గింజల్లో సహజమైన మూత్రవిసర్జన, ఆకలిని తగ్గించే లక్షణాలు ఉంటాయి. వీటిల్లో ఎ, సి, డి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పేగుల ఆరోగ్యానికి మేలు చేసే అనేక యాంటీ ఆక్సిడెంట్లూ ఇందులో లభిస్తాయి. తద్వారా మీ జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. అందువల్ల సోంపు తీసుకుంటే.. మీరు త్వరగా బరువు తగ్గగలుగుతారు.
మెంతి గింజలు!
Fenugreek Seeds : మెంతుల్లో ఉండే ఫైబర్ అధికంగా తినాలనే కోరికలను తగ్గిస్తుంది. వీటిని తింటే.. మీ పొట్ట నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా మెంతి గింజలలో ఉండే మ్యూకిలాజినస్ అనే ఫైబర్ పదార్థం మీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ఆక్సీకరణ ఒత్తిడి నుంచి జీర్ణాశయానికి ఉపశమనం కలిగిస్తుంది. ఫలితంగా మీ బరువు గణనీయంగా తగ్గుతుంది.
ఏలకులు!
Cardamom :ఏలకులు మీ శరీరంలో ఉబ్బరం, మలబద్ధకాన్ని తగ్గించి, అధిక నీటిని బయటకు పంపే గుణాలను కలిగి ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఏలకుల్లో బ్యాక్టీరియాతో పోరాడే క్రియాశీల గుణాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిల్లో ఉండే మెలటోనిన్ అనే యాసిడ్ సాయంతో మీ శరీరంలోని కొవ్వును సులువుగా కరిగించుకోవచ్చు. మీ శరీరంలో అధిక మోతాదులో ఉన్న నీటిని ఏలకులు మూత్రవిసర్జన రూపంలో బయటకు పంపుతాయి.
నల్ల మిరియాలు!
Black Pepper :నల్ల మిరియాలు కేవలం ఆహారానికి రుచిని అందించడం మాత్రమే కాదు, మీ శరీర బరువును కూడా తగ్గించేందుకు ఉపయోగపడతాయి. వీటిలో ఉండే పైపెరిన్ అనే రసాయనం మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తుంది.