తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

సంతాన సమస్యలా? ఈ రసం తాగి చూడండి!

Sperm Increase Food: శృంగారంపై ఆసక్తి పెరగడానికి కొందరు ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదం, మునక్కాడ లాంటివి తింటుంటారు. అయితే వీటి ప్రభావం శాస్త్రీయంగా రుజువు కాలేదు. ఈ విషయంలో మెంతులు మాత్రం బాగా పనిచేస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.

By

Published : Jan 15, 2022, 7:01 AM IST

fenugreek fertility male
మెంతులు

Sperm Increase Food: సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారా? అయితే ఇలాంటి పురుషులు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే వీరికి మున్ముందు మధుమేహం వంటి జీవక్రియల జబ్బులు ముంచుకొచ్చే ప్రమాదముంది. స్వీడన్‌ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వీర్యంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా గలవారిని ఎంచుకొని, ఇతరులతో పోల్చి చూడగా కొన్ని కొత్త సంగతులు బయటపడ్డాయి. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న 50 ఏళ్ల లోపు వారిలో మూడింటి ఒక వంతు మందిలో టెస్టోస్టిరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల స్థాయులు ఏడు రెట్లు తక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. వీరిలో ఎముక సాంద్రత కూడా తక్కువగా ఉంటోంది. ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయులు తగ్గినవారిలో ఇది ప్రముఖంగా కనబడుతోంది. దీని మూలంగా ఎముక క్షీణించటం, తేలికగా విరగటం వంటివి తలెత్తుతాయి. అంతేకాదు.. గ్లూకోజు స్థాయులను సూచించే హెచ్‌బీఏ1సీ కూడా ఎక్కువగానే ఉంటోంది. ఇన్సులిన్‌ నిరోధకతా పెరుగుతోంది. ఇవి రెండూ మధుమేహం ముప్పును పెంచేవే. అందువల్ల సంతాన చికిత్సలు తీసుకునే పురుషులంతా ఒకసారి సెక్స్‌ హార్మోన్ల పరీక్షలు చేయించుకోవటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.. తీవ్రమైన జబ్బుల ముప్పులు గలవారు సంతాన చికిత్సల అనంతరం వాటిపై ఒక కన్నేసి ఉండటమూ మేలని చెబుతున్నారు.

ఉద్దీపన మెంతం

శృంగారంపై ఆసక్తి పెరగటానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. బాదంపప్పు దగ్గర్నుంచి మునక్కాడల వరకు రకరకాల పదార్థాలు తింటుంటారు. అయితే ఇవి ఎంతవరకు పనిచేస్తాయనేది మాత్రం తెలియదు. వీటి ప్రభావాలు శాస్త్రీయంగానూ రుజువు కాలేదు. కానీ ఈ విషయంలో మెంతులు కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. మగవారు మెంతులను తీసుకుంటే శృంగారంపై ఆసక్తి పెరుగుతున్నట్టు తేలటమే దీనికి కారణం. కొందరికి ఆరు వారాల పాటు మెంతుల సారాన్ని ఇచ్చి పరిశీలించగా.. 82% మందిలో శృంగారాసక్తి గణనీయంగా పెరిగినట్టు తేలింది. అంతేకాదు.. 63% మందిలో శృంగార సామర్థ్యమూ మెరుగుపడటం గమనార్హం. మెంతుల్లో సాపోనిన్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇది టెస్టోస్టీరాన్‌ వంటి సెక్స్‌ హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అందువల్ల మెంతులు శృంగారంపై ఆసక్తి పెరగటానికి దోహదం చేస్తుండొచ్చన్నది పరిశోధకుల భావన.

ఇదీ చూడండి:Hair Growth Tips: ఇవి తింటే మీ జుట్టు రాలిపోదు!

ABOUT THE AUTHOR

...view details