అందంగా కనిపించాలన్నా.. ఒత్తిడి, అనారోగ్యం బారిన పడకుండా ఉండాలన్నా.. వ్యాయామం అవసరం. కానీ కాసేపు కూడా సమయం కేటాయించలేం అంటారు చాలామంది. అలాంటి వారు ప్రత్యేకంగా సమయం కేటాయించక్కర్లేకుండానే ఇలా నడిచి చూడండి.
రోజూ పొద్దునే సమయం కేటాయించలేకపోయిన సరే అసలు వ్యాయామమే మానేయొద్దు. రోజులో మీకు వీలున్నప్పుడు ఓ అరగంట కేటాయించుకోండి. లేదంటే గంట లక్ష్యంగా పెట్టుకుని పావుగంట చొప్పున వీలున్నప్పుడు చేయండి. క్రమంగా నడకకు అలవాటు పడతారు.
వేగంగా నడిస్తే మంచిదే.. అలాగని ఒక్కసారే అది సాధ్యపడకపోవచ్చు. మీకు సౌకర్యంగా అనిపించినంత వేగంగా నడిస్తే సరి. అసలంటూ మొదలుపెడితే.. కొన్నాళ్లకు స్పీడు పెరుగుతుంది. సాధారణంగా చదునుగా ఉండే మార్గం కంటే కాస్త ఎత్తుగా ఉండే ప్రాంతాల్లో (కొండలు, గుట్టల ప్రదేశాల్లో) నడవడం వల్ల ఎక్కువ కెలొరీలు ఖర్చవుతాయి. దీనివల్ల మీ శ్వాస రేటు పెరుగుతుంది. ఫలితంగా ఆక్సిజన్ సరఫరా ఎక్కువవుతుంది.
నడవడం వల్ల బరువు తగ్గడమే కాక కాళ్లు, చేతులు, కీళ్ల కండరాలు బలంగా మారతాయి. ఎముకలు గట్టిపడతాయి. వ్యాధినిరోధక శక్తి మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం బయట వాకింగ్ ట్రాక్‌ల మీద, రోడ్లమీద నడిచే పరిస్థితులు లేవు కాబట్టి ఉన్నచోటే నిలబడి నడవండి. ఇది కూడా ఇప్పుడు ట్రెండే.
ఇదీ చదవండి:దోమలు కుడితే ఎయిడ్స్ వస్తుందా?