తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వెచ్చటి నీళ్లు తాగితే... కరోనా పోతుందా? - వేడి నీళ్లు తాగితే కరోనా పోతుందా?

కరోనా వైరస్‌ మన ఒంట్లోకి ప్రవేశించినా వెచ్చటి నీళ్లు తాగితే అది పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బురాదని కొంతమంది భావిస్తున్నారు. ఇంది ఎంతవరకు నిజం..? ఈ కథనం చదవండి.

special story on Uses of drinking hot water
వెచ్చటి నీళ్లు తాగితే... కరోనా పోతుందా?

By

Published : Jun 23, 2020, 10:03 AM IST

కరోనా జబ్బు మీద రకరకాల ప్రచారాలు వ్యాప్తిలో ఉన్నాయి. వెచ్చటి నీళ్లు తాగటమనేదీ ఇలాంటిదే. నీళ్లు తాగటం ఆరోగ్యానికి మంచిదే గానీ ఇది కరోనా నివారణకు తోడ్పడుతుందని అనుకోవటం తప్పు అంటున్నారు నిపుణులు. తరచూ నీళ్లు తాగుతుంటే గొంతులో ఉండే వైరస్‌ అన్నవాహిక ద్వారా జీర్ణాశయం లోపలికి వెళ్లిపోతుందని, ఊపిరితిత్తుల్లోకి చేరుకోదనే భావన దీనికి మూలం. ఇది నిజం కాదు. శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ కాలేదని స్పష్టం చేశారు.

వైద్య నిపుణుల వివరాల ప్రకారం...

నిజంగా ఎవరైనా కరోనా బారినపడ్డారనుకోండి. వైరస్‌ గొంతులోనే తిష్ఠ వేసిందనుకోండి. అక్కడ వేలాది సంఖ్యలో వైరస్‌లుంటాయి. నీళ్లు తాగితే ఇవన్నీ ఒకేసారి గొంతును దాటుకొని, అక్కడ్నుంచి పొట్టలోకి పోతాయని అనుకోవటం భ్రమ. కరోనా వైరస్‌ మీద కొవ్వు పొర ఉంటుంది. దీని సాయంతో కణజాలానికి గట్టిగా అంటుకొని ఉంటుంది. కరోనా వైరస్‌ గొంతు ద్వారానే కాదు.. ముక్కు, కళ్ల ద్వారానూ ఒంట్లోకి ప్రవేశిస్తుందని మరవరాదు.

ఒకవేళ గొంతులో స్థిరపడిందని భావించి నీళ్లు తాగినా.. అంతకుముందే అది ముక్కు ద్వారా శ్వాసకోశంలోకి వెళ్లి ఉండొచ్ఛు పైగా మనం తరచూ చేత్తో ముక్కు, నోరు, కళ్లు తాకుతుంటాం. వైరస్‌తో కూడిన తుంపర్లు అంటుకున్న చోట పెట్టిన చేత్తో ముక్కు, కళ్లను రుద్దుకున్నా వైరస్‌ ఒంట్లోకి చేరుకోవచ్ఛు. గోరు వెచ్చటి నీళ్లు తాగితే గొంతునొప్పి వంటి లక్షణాల నుంచి కాస్త ఉపశమనం లభించొచ్చేమో గానీ గొంతులోని వైరస్‌ పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బు అసలే రాదని అనుకోవటం తగదు.

ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవటం, మాస్కు ధరించటం వంటి జాగ్రత్తలు విధిగా పాటించటమే ఉత్తమమైన నివారణ మార్గమని తెలుసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details