తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చర్మానికి కళ తెచ్చే కాఫీ పొడి.. మీరు ట్రై చేయండి! - కాఫీ పొడి ఉపయోగాలు

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ పడాల్సిందే. ఇది శరీరాన్ని ఉత్తేజితం చేయడమే కాదు...అందానికీ వన్నెలద్దుతుంది. అదెలా అంటారా? చదివేయండి.

special story on Coffee powder uses
చర్మానికి కళ తెచ్చే కాఫీ పొడి.. మీరు ట్రై చేయండి!

By

Published : Jun 23, 2020, 9:20 AM IST

  1. ఒక టేబుల్‌ స్పూన్‌ కాఫీ పౌడర్‌లో చెంచా పాలు కలిపి ముఖానికి పూతలా వేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై ఉన్న మచ్చలు మాయమవుతాయి. ముఖంపై గీతలూ, ముడతలూ తగ్గుతాయి. స్ట్రెచ్‌మార్క్స్‌ ఉన్న చోటా దీన్ని ప్రయత్నించొచ్చు.
  2. కాఫీ పౌడర్‌లో కొద్దిగా పంచదార, నిమ్మరసం, తేనె, చెంచా ఆలివ్‌నూనె కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు వంటి ప్రదేశాల్లో రాసి మృదువుగా రుద్దితే మృతకణాలు తొలగి నునుపుగా మారుతుంది.
  3. టాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు రెండు చెంచా కాఫీ పౌడర్‌లో కొద్దిగా పెరుగు, చెంచా తేనె కలిపి ముఖానికి రాసుకోండి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా కనిపించేలా చేస్తుంది.
  4. రెండు చెంచాల కాఫీ పౌడర్‌లో రెండు చెంచాల ఆలివ్‌నూనె, నానబెట్టి రుబ్బిన బాదం గింజల మిశ్రమం, కాసిన్ని పాలు, రెండు చెంచాల శనగపిండి కలిపి ఒంటికి నలుగులా రుద్దుకోవచ్ఛు ఈ స్క్రబ్‌ చర్మానికి నిగారింపు తెస్తుంది.

ABOUT THE AUTHOR

...view details