తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఆరోగ్య సంజీవని.. సుఖీభవ వెల్​నెస్​ సెంటర్ - Sukhibhava health clinic

అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సుఖీభవ వెల్​నెస్​ సెంటర్​.. రామోజీ ఫిల్మ్​సిటీ సిగలో మరో ఆణిముత్యం. సమస్య ఉంటే దాన్ని నయం చేయడం, అసలు సమస్యే రాకుండా నివారించడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం. ఇందులో ప్రధానంగా ప్రకృతి వైద్యం, ఆయుర్వేదంతో సహా.. సంప్రదాయ థెరపీల సమ్మిళితంగా చికిత్స ఉంటుంది. ఆహారమే ఔషధంగా... యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల దన్నుగా శరీరానికి సాంత్వనను, స్వస్థతను చేకూర్చి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఆరోగ్య సంజీవని.. 'సుఖీభవ వెల్​నెస్ సెంటర్' సేవల గురించి ఓ సారి చూద్దాం.

SUKHIBHAVA WELLNESS CENTER
ఆరోగ్య సంజీవని.. సుఖీభవ వెల్​నెస్​ సెంటర్

By

Published : Sep 20, 2020, 5:11 AM IST

Updated : Sep 21, 2020, 2:04 PM IST

ఆరోగ్య సంజీవని.. సుఖీభవ వెల్​నెస్​ సెంటర్

అంతర్జాతీయ ప్రమాణాలతో అలరారుతోన్న రామోజీ ఫిల్మ్ సిటీ సిగలో మరొక ఆణిముత్యం.. సుఖీభవ వెల్​నెస్​ సెంటర్. అలసిన మనసుకు, సొలసిన శరీరానికి సాంత్వన చేకూర్చి.. స్వస్థతను కలిగించడం ఈ కేంద్రం ప్రత్యేకత. ప్రకృతి ఒడిలో, ప్రాకృతిక ధర్మాలకు పెద్ద పీట వేస్తూ, పరిపూర్ణ ఆరోగ్యానికి కృషి చేసే ఈ వెల్​నెస్ సెంటర్లో మందులన్న మాటే మనకు వినిపించదు. సహజ సిద్ధమైన ఆహార చికిత్సతోపాటు సంప్రదాయ విధానాలైన యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల సాయంతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందించడంలో ఇక్కడి నిపుణులది అందెవేసిన చేయి.

ధ్యానం
ప్రాణయామం

ప్రకృతితో కలిసి...

నీరు, నిప్పు, నింగి, నేల, గాలి.. ప్రకృతిలోని పంచభూతాలివి. మన శరీరం కూడా ఈ పంచభూతాల సమ్మిళితమే. ఈ అయిదూ మన ఆరోగ్యాన్ని అనుక్షణం ప్రభావితం చేసేవే. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం, పొందే ఒత్తిడి, పడుకునే నిద్ర.. ఇలా మన జీవనశైలి కూడా ఆరోగ్యాన్ని నిర్దేశించేదే. ప్రకృతికి దూరంగా వెళ్లినా, జీవనశైలి గతి తప్పినా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి.

ఒకసారి ఆరోగ్యం చేజారితే దాన్ని తిరిగి చేజిక్కించుకోవడం కొంత కష్టసాధ్యమైన విషయమే. అందుకే మన పూర్వీకులు 'ఆరోగ్యమే మహాభాగ్యం' అన్నారు. ఆ మహద్భాగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దానికోసం ప్రకృతి చెంత జీవించాలి, పంచభూతాల సహకారం తీసుకోవాలి, జీవనశైలిని చక్కగా మలచుకోవాలి. ఇలా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు ఇప్పుడు రామోజీ ఫిల్మ్​సిటీలోని సుఖీభవ వెల్​నెస్ సెంటర్ అందరికీ అందుబాటులో ఉంది.




సమస్యను గుర్తించడం, నివారించడమే లక్ష్యం

"రామోజీ ఫిల్మ్​సిటీలోని సుఖీభవ వెల్​నెస్​ సెంటర్​ని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేశాం. ఈ వెల్​నెస్​ సెంటర్ ప్రధాన ఉద్దేశం ఏదైనా సమస్య ఉంటే దాన్ని నయం చేయడం, రెండోది అసలు సమస్యే రాకుండా నివారించడం. వెల్​నెస్​ సెంటర్లో ప్రధానంగా ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, అలాగే అంతర్జాతీయంగా కొన్ని సంప్రదాయ థెరపీల సమ్మిళితంగా చికిత్స ఉంటుంది. వెల్​నెస్​ సెంటర్ అనగానే ఇదేదో స్పా లాంటిది కాదు. వ్యక్తి తాలూకూ శరీర తత్వాన్ని సమగ్రంగా అంచనా వేసి వారికి చికిత్స ప్లాన్ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ నివారణ థెరఫీల మీద దృష్టి పెడుతున్నాం. చికిత్సలు కూడా ఉన్నాయి.

ఈ వెల్​నెస్​ సెంటర్​ని ఎలా డిజైన్ చేశామంటే, బయట ప్రాంతాల నుంచి చాలామందే వస్తుంటారు. వారికి వసతి సౌకర్యం కూడా ఉంది. వారు ఇక్కడే ఉంటూ జీవనశైలిని ఎలా మలచుకోవాలో చెబుతాం. ఎందుకంటే, ప్రస్తుతం జీవనశైలి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవాళ్లకు వసతి సౌకర్యం కల్పించడం సహా.. వారి ఆహారం, వ్యాయామం, నిద్ర, మొత్తం జీవనశైలి ఎలా ఉండాలో రూపకల్పన చేస్తాం. ఈ ప్లానింగ్​లో నివారణతో పాటు అవసరమైతే సంప్రదాయ, ప్రాకృతిక చికిత్సా మార్గాలను కూడా మేం అందజేస్తాం. ఇక్కడ మేం అందజేస్తున్న వసతి సౌకర్యాల్లో కూడా లెవెల్స్ ఉన్నాయి. ప్రీమియం అనీ, నార్మల్ అనీ.. ఎవరికి సౌకర్యవంతంగా ఉన్నవి వారు ఎంపిక చేసుకోవచ్చు."

- డాక్టర్​ అర్చన, సుఖీభవ వెల్​నెస్​ సెంటర్​ డైరెక్టర్

సకల సౌకర్యాల ఆరోగ్య పరుసవేది

డైట్

ఒంట్లో పేరుకుపోయిన, తుప్పుపట్టిన అనారోగ్య మలినాలను తొలగించి బంగారం లాంటి ఆరోగ్యాన్ని అందించే పరుసవేది మన సొంతమైతే? నిస్సారమై, నిస్త్రాణగా మారిన ప్రాణానికి కొత్త ఊపిరులూది సరికొత్త జవసత్వాల్ని అందించే సంజీవని ఏదైనా మన సొంతమైతేనో... అలాంటి పరుసవేది, సంజీవని లాంటి ఆరోగ్య అస్త్రాలను సుఖీభవ వెల్​నెస్​ సెంటర్ అందిస్తోంది. ప్రకృతిసిద్దమైన డైట్ థెరపీ, మడ్ థెరపీ, ఇన్ ఫ్రా రెడ్ సోనా, సంప్రదాయ అభ్యంగనం, అరోమా థెరఫీ, హైడ్రో థెరపీ, థాయ్ స్ట్రెచెస్, ఆయుర్వేద చికిత్సలు, మరెన్నో యోగ క్రియల సమ్మేళనంతో రామోజీ ఫిల్మ్​సిటీలోని సుఖీభవ వెల్​నెస్​ సెంటర్ అందరికీ అందుబాటులో ఉంది.

సంప్రదాయ పద్ధతులలో ఆరోగ్యామృత ధార

"మనం ప్రకృతిలో అంతర్భాగం. నేడు ప్రకృతికి దూరమవుతున్నాం కాబట్టే ఆరోగ్యానికీ దూరమవుతున్నాం. ఈ నేపథ్యంలో నానావిధ మందులు, కోతలు, చికిత్సల అవసరం లేకుండా ప్రకృతి సిద్ధంగా సాంత్వన చేకూర్చడం, సంప్రదాయ పద్ధతులలో ఆరోగ్యామృత ధారల్ని అందరికీ పంచడమే సుఖీభవ వెల్​నెస్​ సెంటర్ ఉద్దేశం."

- డా. జేఎస్​ శ్రీనివాసన్, సుఖీభవ వెల్​నెస్​ సెంటర్​ మేనేజర్

వివరాలకు సంప్రదించండి

ఇదీ చదవండి:అల్పాహారంతో అనంతమైన శక్తి!

Last Updated : Sep 21, 2020, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details