- పాల ఉత్పత్తులు:పాలు, పెరుగు, చీజ్... లాంటి పాల ఉత్పత్తుల నుంచి క్యాల్షియం, ప్రొటీన్, విటమిన్-డి లభిస్తాయి. ఇవి ఎముకలు బలంగా ఉండేందుకు సాయపడతాయి. వీటితో పొట్ట నిండినట్లు అనిపించి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. బరువు పెరుగుతామనే భయమూ ఉండదు.
- చిరుధాన్యాలు: అత్యావశ్యక పోషకాలు, పీచు... లాంటివి గోధుమ, జొన్న, రాగులు, బ్రౌన్‌రైస్‌లలో మెండుగా ఉంటాయి. ఎముక ఆరోగ్యాన్ని పెంచడంతోపాటు రోగనిరోధక శక్తినీ అందిస్తాయి.
- గుడ్లు: మాంసకృత్తులు మెండుగా ఉంటాయి. కండరాలు, ఎముకలను బలంగా మారుస్తాయి. అలసట, నిస్సత్తువ లాంటివి దరిచేరకుండా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి.
Health tips: మీ వయస్సు 30 దాటిందా... ఎముకలు జాగ్రత్త! - some tips to keep bones strong in women after the age of 30
మహిళల్లో 30 ఏళ్లు దాటిన తర్వాత ఎముకలుబలహీనమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి... ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే..!!
HEALTH TIPS