- పగుళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు రోజూ ఉదయం, సాయంత్రం రెండు టేబుల్ స్పూన్ల ఆముదంలో చెంచా తేనె కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసుకుని ఆరనివ్వాలి. ఆపై కాస్త పంచదారని తీసుకుని చేతుల్ని తడుపుకొంటూ పగిలిన మడమలకు రాసుకుని మర్దన చేయాలి.
- కొందరి పాదాలు బిరుసుగా మారతాయి. ఇలాంటి వారు కొద్దిగా పెట్రోలియం జెల్లీలో చెంచా గులాబీ నూనె కలిపి రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే... మృదువుగా మారతాయి.
- పావుకప్పు నారింజ రసంలో, చెంచా తులసి పొడి, ఆముదం, కొద్దిగా కలబంద గుజ్జు కలిపి పాదాలకు రాసి రుద్దండి. ఇవి మృతకణాలను తొలగించి... మృదువుగా మారుస్తాయి.
పాదాల పగుళ్లకు చెక్ పెట్టండిలా! - health tips
కాలంతో పనిలేకుండానే కొందరిని పాదాల పగుళ్లు వేధిస్తాయి. దీనికి కారణాలేవైనా... కాస్త శ్రద్ధపెడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కోమలంగానూ ఉంటాయి.
పాదాల పగుళ్లకు చెక్ పెట్టండిలా!
ఇదీ చూడండి:ఈ ఎండల్లో.. మ్యాంగో మస్తానితో ఆహా!