తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

చలికాలం చర్మాన్ని మరింత అందంగా మార్చండిలా... - etv bharat sukhibhava

చలికాలంలో ఎదురయ్యే కొన్ని రకాల చర్మ సమస్యలను నివారించడానికి ఖరీదైన పూతలే అవసరం లేదు. ఇంట్లోనే ఎంతో ఈజీగా ముఖాన్ని నిగనిగలాడించొచ్చు. తేనె, కొబ్బరి నూనె వంటి ఇంట్లో దొరికే వస్తువులతో చర్మానికి పునర్జీవం పోయొచ్చు.. అదెలాగో చూసేయండి..

soft-skin-in-winter-season-telugu-tips
చలికాలం చర్మాన్ని మరింత అందంగా మార్చండిలా...

By

Published : Sep 22, 2020, 10:31 AM IST

అసలే చలికాలం. పైగా పెరుగుతున్న వాతావరణ కాలుష్యం. చర్మం పొడిబారి, పగిలి, నిర్జీవంగా మారుతుంది. అందుకే ఈ టిప్స్ తో చర్మాన్ని చలికాలంలోనూ ఆరోగ్యంగా ఉంచుకుందాం...

బయటకు వెళ్లివచ్చిన వెంటనే ముఖం, కాళ్లు, చేతుల్ని శుభ్రంగా కడగాలి. పచ్చిపాలల్లో దూది ముంచి ముఖం, చేతులు, మెడను తుడవాలి. దీంతో పేరుకున్న దుమ్ము, ధూళీ పోయి చర్మం శుభ్రపడుతుంది. తర్వాత తేనె, నిమ్మరసం, కొబ్బరినూనె పెద్ద చెంచా చొప్పున తీసుకుని కలిపి చర్మానికి రాసుకోవాలి. ఆరాక కడిగేసి మాయిశ్చరైజర్‌ రాసుకుంటే చాలు.

ఉదయం పూట స్నానానికి ముందు నలుగు పెట్టుకుంటే మృతకణాలు పోతాయి. దీనికోసం రెండు టేబుల్‌స్పూన్ల తేనెలో అరచెంచా చక్కెర కలిపి ముఖం, మెడా, చేతులకు రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక స్నానం చేస్తే చాలు.

వాతావరణం చల్లగా ఉన్నా కూడా సన్‌స్క్రీన్‌లోషన్‌ తప్పనిసరి. ముఖానికి స్కార్ఫ్‌, చేతులకు గ్లవ్​లు వేసుకుంటే కాలుష్యం, ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

ఇదీ చదవండి: ఉప్పు వాడకం పెరిగితే ఇన్ని అనర్థాలా?

ABOUT THE AUTHOR

...view details