Soaked Peanuts Benefits in Telugu: వేరుశెనగను సామాన్యుడి జీడిపప్పు అని అంటుంటారు. దీనితో టేస్ట్ మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 100 గ్రాముల వేరుశనగల నుంచి దాదాపు 567 కెలొరీల శక్తి లభిస్తుంది. అయితే.. వేరుశనగలను నానబెట్టి తింటూ ఉంటారు. మరి.. ఇలా తింటే లాభమా? నష్టమా? అంటే.. చాలా లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుందని చెబుతున్నారు. మరి.. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.
గుండె జబ్బులు దూరం:నానబెట్టిన వేరుశనగలు తినడం చాలా మంచిది. అందులో ఉండే.. మోనో అన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు శరీరంలోని చెడు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. దీర్ఘకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది. వేరుశనగ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
కండరాల పెరుగుదల:వేరుశెనగలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. నానబెట్టిన వేరుశనగ కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది. కండరాల క్షీణతను నివారిస్తుంది. దృఢమైన శరీరాన్ని కోరుకునేవారు ఉదయాన్నే నానబెట్టిన వేరుశెనగలను తినడం ప్రయోజనకరం. ఉదయం పూట వేరుశనగ మొలకలు కూడా తినవచ్చు. ప్రొటీన్లతో పాటు, ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఇ, సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
చలికాలంలో మోకాళ్ల నొప్పులా? ఈ ఫుడ్స్‌తో రిలీఫ్ పొందండి!
బరువు:వేరుశనగ ఎక్కువ సేపు ఆకలిని నియంత్రిస్తుంది. ఇవి తింటే వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీంతో మనం ఇతర ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గుతుంది. ఫలితంగా శరీర బరువు అదుపులో ఉంటుంది.
జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది:ఫైబర్ అధికంగా ఉండే ఆహారం జీర్ణక్రియకు సహాయపడుతుందని మనందరికీ తెలుసు. వేరుశెనగలో సమృద్ధిగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన వేరుశెనగలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ తగ్గుతుంది.
రక్తంలో చక్కెర నియంత్రణ: తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాల జాబితాలో వేరుశెనగ కూడా ఉంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర సమతుల్యంగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపుతాయి.