తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Snoring remedy : గుర‌క ఎక్కువ‌గా వ‌స్తోందా? ముందుగా ఈ పని చేస్తే అంతా సెట్​!

Snoring remedy : ఇంట్లో ఎవ‌రైనా గురక పెట్టి నిద్ర‌పోతే ఇత‌రుల‌కు ఇబ్బందిగా ఉంటుంది. బాగా అల‌సిపోయిన వాళ్లు గుర‌క పెట్టి నిద్ర‌పోతారు అనేది అవాస్త‌వం. మ‌రి ఈ గుర‌క ఎందుకు వ‌స్తుంది..? దీని వ‌ల్ల క‌లిగే ఇబ్బందులు, ప‌రిష్కార మార్గాలు చ‌దివి తెలుసుకోండి.

Snoring reasons
Snoring remedy

By

Published : May 30, 2023, 2:56 PM IST

Snoring remedy : గుర‌క‌.. చాలా మంది త‌మ ఇళ్ల‌లో ఎదుర్కొనే స‌మ‌స్య‌. ప‌గలంతా క‌ష్ట‌ప‌డి రాత్రి హాయిగా నిద్ర‌పోదాం అనుకునే స‌మ‌యంలో దీని వ‌ల్ల ఇబ్బందిగా ఫీల‌వుతారు. అయితే అనేక మంది గుర‌క అనేది మంచి నిద్ర‌కు సంకేత‌మ‌ని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. సాధార‌ణ వ్య‌క్తుల‌తో పాటు బీపీ, షుగ‌ర్ ఉన్న వాళ్లు దీని వ‌ల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? ప‌రిష్కార మార్గాలు ఏంటో ఇది చ‌దివి తెలుసుకోండి.

Snoring reasons : సాధార‌ణంగా గుర‌క అనేది ఒక జ‌బ్బుకు ల‌క్ష‌ణంగా గుర్తించాలి. దీన్ని అబ్​స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (OSA) అని అంటారు. ఇది రాత్రి ప‌డుకున్నప్పుడు శ్వాస తీసుకోవ‌డానికి ఇబ్బందులు క‌లుగ‌జేస్తుంది. దీని వ‌ల్ల ఆక్సిజ‌న్​తో పాటు కార్బ‌న్ డై ఆక్సైడ్​లో మార్పులు జ‌రుగుతాయి. త‌ద్వారా మ‌న‌కు గుండె, ఊపిరితిత్తుల‌పై ఒత్తిడి ప‌డే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి దీన్ని ఒక జ‌బ్బుకు ల‌క్ష‌ణంగా ప‌రిగ‌ణించాలని వైద్యులు చెబుతారు. ఉబ‌కాయం, డ‌బుల్ చిన్‌, చిన్న మెడ ఉన్న వాళ్ల‌లో ఇది ఎక్కువ‌గా వ‌స్తుంది.

Snoring causes : బాడీ మాస్ ఇండెక్స్ 30కి పైగా ఉన్న‌ప్పుడు ఉబ‌కాయం వస్తుంది. ఒబేసిటి ఉన్న వాళ్లలో గుర‌క అనేది కామ‌న్​గా ఉంటుంది. ముక్కు నుంచి గొంతులోకి వెళ్లే ప్రాంతంలో కొవ్వు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు గుర‌క వ‌స్తుంది. దీని వ‌ల్ల గుండె, ఊపిరితిత్తుల‌కు ఇబ్బందులు ఏర్ప‌డతాయి. కాబట్టి బ‌రువు త‌గ్గితే ఫ‌లితం ఉంటుంది. దీంతోపాటు మంచి డైట్ పాటిస్తే ఫ‌లిత‌ముంటుంది.

Snoring test : గుర‌క తీవ్ర‌త‌ను తెలుసుకునేందుకు స్లీప్ స్ట‌డీ అనే ప‌రీక్ష చేస్తారు. అది రాత్రి పూట మాత్ర‌మే చేస్తారు. దీని వ‌ల్ల ఆక్సిజ‌న్ లెవ‌ల్స్, బీపీ సంబంధ స‌మ‌స్య‌లు, గుండె వేగం త‌దిత‌ర అంశాలు తెలుసుకోవ‌చ్చు. స‌మ‌స్య తీవ్ర‌త‌ను గ్రేడింగ్ ప‌ద్ధ‌తిలో నిర్ణ‌యిస్తారు. త‌క్కువ ఉంటే మైల్డ్, మ‌ధ్య‌స్థంగా ఉంటే మోడ‌రేట్, ఎక్కువ‌గా ఉంటే సివియ‌ర్​గా భావిస్తారు. ఈ గ్రేడింగ్​ను బ‌ట్టే చికిత్స కూడా ఉంటుంది.

Snoring stop naturally : చాలా మందికి బీపీ రావ‌డానికి కూడా గుర‌కే కార‌ణమ‌ని వైద్యులు చెబుతున్నారు. గుర‌క ఉన్న ప్ర‌తి 100 మందిలో 50 శాతం మందికి బీపీ వ‌చ్చిన‌ట్లు వివిధ ర‌కాల అధ్య‌య‌నాల్లో తేలింది. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకుని.. గుర‌కను అంత తేలిగ్గా తీసిపారేయ‌కుండా త‌గిన జాగ్రత్త‌లు పాటించాలి. ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డాల‌నుకునే వారు ప్ర‌ధానంగా బ‌రువు త‌గ్గ‌డంపై దృష్టి పెట్టాలి. ఒక‌వైపు దీనికోసం ప్ర‌య‌త్నిస్తూనే.. మ‌రోవైపు స‌మస్య తీవ్ర‌త‌ను తెలుసుకుని చికిత్స చేయించుకోవాలి.

గుర‌క తగ్గేందుకు చిట్కాలు

ABOUT THE AUTHOR

...view details