పొగ తాగటం ఎముకలకు హానికరం! పొగతాగే మగవారికి ఎముకలు గుల్లబారటం, విరగటం, అకాల మరణం ముప్పులు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ నెవెడా, లాస్ వేగాస్ (యూఎన్‌ఎల్‌వీ) అధ్యయనం పేర్కొంటోంది. ఇందులో మొత్తం 27 పరిశోధనలను విశ్లేషించారు. పొగ తాగేవారికి ఎముకలు విరిగే ముప్పు 37 శాతం పెరుగుతున్నట్టు గుర్తించారు. తుంటి మాత్రమే కాకుండా మణికట్టు, భుజాలు, కాళ్లు, వెన్నెముక వంటి ఇతర భాగాలకూ పొగతో ముప్పు పొంచి ఉంటున్నట్టు బయటపడింది. తుంటి విరిగే ముప్పు 30 శాతం, వెన్నెముక విరిగే ముప్పు 40 శాతం పెరుగుతుండటం గమనార్హం. ఎముకలు విరిగిన పొగరాయుళ్లలో 21-37 శాతం మంది ఏడాదిలోపే మరణిస్తుండటం ఆందోళనకరం.
పొగతాగితే ఎముకలు గుల్ల.. అకాల మరణం! - health news latest
పొగ తాగేవారికి ఎముకలు విరిగే ముప్పు 37 శాతం పెరుగుతున్నట్టు ఓ పరిశోధనలో తేలింది. తుంటి మాత్రమే కాకుండా మణికట్టు, భుజాలు, కాళ్లు, వెన్నెముక వంటి ఇతర భాగాలకూ పొగతో ముప్పు పొంచి ఉంటున్నట్టు బయటపడింది. ఎముకలు విరిగిన పొగరాయుళ్లలో 21-37 శాతం మంది ఏడాదిలోపే మరణిస్తున్నట్లు తేలింది.
సాధారణంగా ఎముకలు గుల్లబారటం పురుషుల కన్నా మహిళల్లో ఎక్కువ. కానీ పొగ అలవాటుతో మగవారికీ దీని ముప్పు పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్లలోని రసాయనాలు ఎముక కణాల మీద విపరీత ప్రభావం చూపుతాయి. విటమిన్ డి, క్యాల్షియంను శరీరం సరిగా గ్రహించుకోకుండా అడ్డుపడతాయి. ఇవి ఎముకల పటుత్వాన్ని దెబ్బతీస్తాయి. అంతేకాదు.. పొగతో కణజాలం మరమ్మతు కావటమూ నెమ్మదిస్తుంది. దీంతో గాయం మానటం, ఎముక అతుక్కోవటం ఆలస్యమవుతుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇది సమస్యను మరింత జటిలం చేస్తుంది. కాబట్టి పొగ అలవాటును మానుకోవటం మంచిదని.. దీంతో ఎముకలు విరగటం, వైకల్యం, అకాల మరణం ముప్పులను నివారించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:ఆఫీస్‌లోనే ఈజీగా యోగా.. ఈ 5 ఆసనాలతో స్ట్రెస్, మెడ నొప్పి మాయం!