Smart weight loss plan:ప్రస్తుత కాలంలో అధిక బరువు సాధారణ సమస్యగా మారిపోయింది. స్థూలకాయమనేది చాలా ఆరోగ్య సమస్యలకు మూలంగా ఉంటోంది. ప్రతి ఒక్కరూ నాజూగ్గా, ఫిట్‌గా ఉండాలని అనుకుంటారు. సరైన బరువు కలిగి ఉండటమే ఆరోగ్యకరమైన శరీరానికి మూలసూత్రం. ఆరోగ్యకరమైన బరువు.. అనారోగ్య సమస్యల నుంచి వచ్చే ప్రమాదాన్ని బాగా తగ్గిస్తుంది. బరువు తగ్గే విషయంలో సహాయపడే గ్యాడ్జెట్లు కూడా ఉన్నాయి. ఫిట్నెస్ యాప్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు, స్మార్ట్ వాచ్‌లు ఇందుకు ఉదాహరణలు. వీటిని ఉపయోగించడం ద్వారా సులభంగా బరువు తగ్గొచ్చు.
smart weight loss goals examples:ఎక్కువ మందిలో బాడీ మాస్ ఇండెక్స్(బీఎంఐ) ద్వారా వారి బరువు ఆరోగ్యకరమైనదా కాదా అన్నది తెలుసుకోవచ్చు. సరైన 'బీఎంఐ' కలిగి ఉండాలంటే ఆరోగ్య కరమైన ఆహారంతో పాటు వ్యాయామం చేయడం చాలా అవసరం. ఈ బీఎంఐని కొలిచే యాప్‌లు చాలా అందుబాటులో ఉన్నాయి. అలాగే చాలా మంది తెగ కష్టపడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. దీనివల్ల బరువు తగ్గడమేమో గానీ, బలహీనంగా తయారవుతున్నవారు చాలా మంది ఉంటారు. అందుకే బరువు తగ్గడం కోసం ఆరోగ్యకరమైన విధానాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఎంత తింటున్నామో, ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నామో తెలియడం అవసరం.
'స్మార్ట్' పరికరాల వల్ల లాభాలు
• స్మార్ట్ పరికరాలు మన ఫిట్నెస్ లక్ష్యాలను పర్యవేక్షిస్తాయి.
• డైట్, వ్యాయామానికి సంబంధించిన ప్రణాళికలను ట్రాక్ చేస్తాయి.
• మన ప్లాన్లను మెరుగుపర్చుకునేందుకు ఉపయోగపడతాయి.
• సంక్లిష్టమైన కేలరీ కౌంట్, హార్ట్‌బీట్ మానిటర్ వంటి సేవలను అందిస్తాయి.
• నిద్ర నాణ్యతను అంచనా వేసి.. కీలకమైన సమాచారాన్ని అందజేస్తాయి.
"మోడ్రన్ టెక్నాలజీతో పాటు బరువు తగ్గడానికి అనేక గ్యాడ్జెట్స్ వచ్చాయి. వీటిని ఉపయోగించి బరువు తగ్గడాన్నే స్మార్ట్(S.M.A.R.T) వెయిట్ లాస్ అంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదని అనిపిస్తే.. వీటిని ఓసారి ప్రయత్నించాలి. రోజూ తగినన్ని అడుగులు వేస్తున్నామా? ఎన్ని కేలరీలు తీసుకుంటున్నాం? ఎన్ని కేలరీలు ఖర్చు చేస్తున్నాం? అన్నది ఇందులో చూసుకోవాలి. వారం పాటు చేసిన వివిధ యాక్టివిటీలను చెక్ చేసుకొని తర్వాతి వారం వ్యాయామ, డైట్ ప్రణాళికలను రూపొందించుకోవాలి. క్రాష్ డైట్ కాకుండా చూసుకోవాలి."
-డా. టీ లక్ష్మీకాంత్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్