Late Sleeping Side Effects :పని చేస్తే.. మనిషి అలసిపోతాడు. కంపల్సరీ రెస్ట్ తీసుకుంటాడు. మరి.. పనిచేసే మెదడుకు విశ్రాంతి అవసరం లేదా? మనిషి నిద్రపోయినప్పుడే దానికి కాసింత రెస్ట్ దొరుకుతుంది. కానీ.. జనాలు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. రాత్రి మంచం ఎక్కిన తర్వాత కూడా ఫోన్ పట్టుకొని గంటల తరబడి బ్రెయిన్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. ఇలా చేయడం వల్ల.. గుండె సంబంధిత వ్యాధులు, ఒబెసిటీ, డయాబెటిస్ వంటి వ్యాధులతోపాటు హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిద్రపోయే ముందు ఇలా చేస్తే.. 5 ఏళ్లు ఎక్కువ బతుకుతారట!
మెదడులో ఏం జరుగుతుంది?:చాలా మందికి నిద్ర విలువ తెలియదు. దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ.. మెదడుకు నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతేనే బ్రెయిన్ రిపేరింగ్ ప్రాసెస్ మొదలు పెడుతుంది. మెమరీని మరింత మెరుగుపరిచే ప్రయత్నం చేస్తుంది. మనిషి కావాల్సినంత నిద్రపోయినప్పుడు.. మర్నాడు హుషారుగా నిద్రలేవడానికి కారణం ఇదే. అంటే.. సర్వీసింగ్ చేస్తుందన్నమాట. అలాంటిది.. మనం నిద్ర పోకుండా మెలకువగా ఉన్నట్లయితే.. అది మనం చెప్పే పని మాత్రమే చేస్తుంది. దాంతో.. శరీర, మానసిక ఆరోగ్యాన్ని రిపేర్ చేసే సమయం దానికి దొరకదు. దాంతో.. అనేక రోగాలకు ఒంట్లో పుట్టుకొస్తాయి.
రాత్రిళ్లు ఫోన్ వాడకాన్ని తగ్గించే 7 చిట్కాలు.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు!
ఎవరు ఎంతసేపు నిద్రపోవాలి?:
- అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 నెలల వరకు రోజుకు 14 నుంచి 17 గంటల నిద్ర పోవాలి.
- 4 నుంచి 11 నెలల పిల్లలు.. 12 నుంచి 14 గంటలు
- 12 నుంచి 35 నెలల చిన్నారులు 11 నుంచి 14 గంటలు
- 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలు 10 నుంచి 13 గంటలు
- 6 నుంచి 13 సంవత్సరాల వారు 9 నుంచి 11 గంటలు
- 14 నుంచి 17 వరకు 8 నుంచి 10 గంటలు నిద్రపోవాలి.
- 18 నుంచి ఆపై ఉన్న వారు రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.
రాత్రులు సరిగా నిద్ర పట్టడం లేదా..? ఈ నియమాలు పాటిస్తే చాలు..