Skin Problems In Rainy Season : వర్షాకాలం అంటేనే చాలా మంది భయపడతారు. ఎందుకంటే వ్యాధులు ఎక్కువగా వ్యాప్తి చెందే సీజన్ ఇదే కాబట్టి. అయితే వర్షాకాలంలో జ్వరం, దగ్గు, జలుబు వంటి సాధారణ అనారోగ్య సమస్యలే కాకుండా ఇతర రకాల వ్యాధులు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చర్మ వ్యాధుల గురించి. అయితే వర్షాకాలంలో కొందరిని 'పిట్టెడ్ కెరటోలైసిస్' అనే చర్మవ్యాధి సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇంతకీ 'పిట్టెడ్ కెరటోలైసిస్' అంటే ఏమిటి..? ఇది శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది..? మరి దీనికి చికిత్స ఉందా..? ఇది మళ్లీ మళ్లీ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
పిట్టెడ్ కెరటోలైసిస్ అంటే ఏమిటి..?
What Is Pitted keratolysis : 'పిట్టెడ్ కెరటోలైసిస్' అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది ముఖ్యంగా మనిషి చర్మంపై ప్రభావం చూపిస్తుంది. అది కూడా అరికాళ్లు, అరిచేతుల్లో ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అయితే ఈ చర్మవ్యాధి అంత ప్రమాదకరమైనది కాకపోయినా అది వచ్చినప్పుడు మాత్రం చాలా మంది కొన్ని ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ కెరటోలైసిస్ వ్యాధి ఎక్కువగా నీటిలో ఉండేవారికి, తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పని చేసేవారిలో వస్తుంది. అయితే కేవలం వీరికి మాత్రమే కాకుండా కొన్నిసార్లు శరీరం నుంచి అధిక చెమట విడుదలతో బాధపడే వారిలోనూ ఈ బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తిస్తుంది. సాధారణం కంటే ఎక్కువగా చెమట విడుదలయ్యే వారి అరికాళ్లల్లో, అరిచేతుల్లో ఇది వస్తుంది. ముఖ్యంగా వీరు గంటల తరబడి బూట్లు, సాక్స్‌లు ధరించడం కారణంగా ఆయా ప్రదేశాల్లో గాలి సోకకుండా బిగుతుగా ఉండడం ద్వారా కూడా ఈ ఇన్ఫెక్షన్ ఎటాక్ చేస్తుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో వీరు ఈ సమస్యను ఎదుర్కొంటారు.
ఎలా గుర్తించాలి..?
How To Identify Pitted keratolysis On Feet : సాధారణంగా ఈ బ్యాక్టీరియా తడిగా ఉన్న అరికాళ్లకు లేదా అరిచేతులపై త్వరగా వృద్ధి చెందుతుంది. గంటల తరబడి నీటిలో ఉన్నా.. ఎక్కువ సేపు అరికాళ్లకు, అరిచేతులకు గాలి తగలకుండా ఉండే గ్లౌజులు, సాక్సులు, బూట్లు వేసుకున్నా ఈ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. దీంతో ఆయా భాగాల్లో గాలి పోయేందుకు వీలు లేకపోవడం వల్ల చర్మం పైపొర మొత్తం తెల్లగా మారి 1 నుంచి 3 మిల్లిమీటర్ల పరిమాణంలో చిన్నపాటి రంధ్రాలు ఏర్పడతాయి. ఇదే 'పిట్టెడ్ కెరటోలైసిస్' ప్రధాన లక్షణం. అయితే ఇవి వచ్చినప్పుడు పెద్దగా నొప్పి వంటిది ఏమి ఉండదు. కానీ, దురద, దుర్వాసన మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వీటి ద్వారా వచ్చే వాసనతో పనిప్రదేశాల్లోని వారు కూడా కాస్త ఇబ్బందికి లోనవుతుంటారు.
వీరికి ముప్పు..
Who Affects For Pitted keratolysis : క్రిములు ఎక్కువగా చీకటి, తడి, తేమ ప్రదేశాల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతాయి. ఇళ్ల నిర్మాణాలప్పుడు కూలీలు ధరించే పెద్ద పెద్ద బూట్లు వేసుకోవడం వల్ల వారిలోనూ ఈ ఇన్ఫెక్షన్ తరచూ వస్తుంటుంది. వీరే కాకుండా రైతులు, కూలీలు, నావికులు, జాలర్లు, అథ్లెట్లు, సైనికులు, పరిశ్రమల్లో పని చేసేవారు కూడా ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. అలాగే తేమ శాతం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తూ.. కాళ్లకు చెప్పులు లేకుండా తిరిగేవాళ్లల్లో కూడా ఈ పిట్టెడ్ కెరటోలైసిస్ వస్తుంటుంది.
ఇలా చేస్తే కూడా వచ్చే ప్రమాదముంది..
⦁ తరచుగా నీటితో కాళ్లు, చేతులు కడగటం.
⦁ స్నానం చేసిన తర్వాత కాళ్లను గాలికి ఆరనివ్వకపోవడం.
⦁ తడిని పీల్చే సాక్సులు ధరించకపోవడం.
⦁ ఇతరులు వాడిన టవల్స్‌ను ఉపయోగించడం.
వీరికీ పిట్టెడ్ కెరటోలైసిస్తో ముప్పు..
⦁ వేడి, తేమ ప్రదేశాల్లో ఎక్కువగా ఉండటం.
⦁ చేతులకు, కాళ్లకు ఎక్కువగా చెమట పట్టడం.