తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వర్షకాలంలో చర్మం జాగ్రత్త! ఈ ఇంటి చిట్కాలతో సౌందర్యం పెంచుకోండి!

వర్షకాలంలో అనేక చర్మ సమస్యలు వస్తాయి. ఇంట్లో లభించే పదార్థాలతో ఫేస్ ప్యాక్‌లు తయారుచేసి రాసుకోవడం వల్ల చర్మాన్ని సౌందర్యంగా ఉంచుకోవచ్చు. అదెలాగో ఇందులో చూద్దాం.

skin care in rainy season
skin care in rainy season

By

Published : Jul 21, 2023, 7:45 AM IST

Skin care in Rainy season : నైరుతి రుతుపవనాల ప్రభావంతో అన్నిచోట్ల భారీ వర్షాలు మొదలయ్యాయి. అయితే వర్షకాలం వచ్చిందంటే చర్మ సమస్యలు చాలా వస్తాయి. చల్లని వాతావరణం వల్ల చర్మం పొడిబారిపోవడం, చర్మంపై దద్దుర్లు, అలర్జీలు రావడం లాంటివి జరుగుతుంటాయి. అంతేకాకుండా చల్లని వాతావరణంతో చర్మం ముడతలు పడటం, పగుళ్లు ఏర్పడటం జరుగుతుంది. వీటి నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే వర్షకాలంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

Skin care tips : చర్మాన్ని రక్షించుకునేందుకు చాలామంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన క్రీమ్‌‌లను వాడుతూ ఉంటారు. కానీ రసాయనాలతో తయారుచేసినవాటిని ఉపయోగించడం వల్ల మీ చర్మానికి మరిన్ని సమస్యలు రావొచ్చు. దీంతో వాటిని పక్కన పెట్టి ఇంట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో వర్షకాలంలో చర్మాన్ని కాపాడుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పాలు, తేనెతో ఇలా చేయండి
రెండు టీ స్పూన్ల ముడి పాలల్లో ఒక టీ స్పూన్ తేనె కలపండి. రెండు కలిసిపోయేలా తిప్పండి. ఆ తర్వాత ఆ ద్రవాన్ని మీ ముఖంపై రాసుకుని మర్దన చేసుకోండి. రెండు లేదా మూడు నిమిషాలు పాటు మర్ధన చేసుకున్న తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మిల్క్, తేనెలో ఉండే గుణాలు చర్మం మెరిసేలా చేయడంతో పాటు జిడ్డును తొలగిస్తాయి. సున్నితమైన చర్మం కలిగినవారికి ఈ విధానం బాగా ఉపయోగపడుతుంది.

పప్పు ధాన్యాలతో ఫేస్ ప్యాక్
పప్పు ధాన్యాలను నీళ్లల్లో రాత్రంతా నానబెట్టండి. ఆ తర్వాత వాటిల్లో పాలు పోసి మెత్తగా అయ్యేవరకు ఉంచండి. మెత్తగా అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖం, గొంతు, మెడకు రాసుకోండి. 5 నుంచి 10 నిమిషాల తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రపర్చుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మీ చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

దోసకాయతో చర్మ రక్షణ
దోసకాయ, అలోవెరాలో చర్మానికి మేలు చేసే పదార్థాలు చాలా ఉన్నాయి. దోసకాయ, అలోవెరాను కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం,మెడపై మర్దన చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వేడి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలోవెరాలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నాయి. వీటిని దోసకాయతో కలపడం వల్ల మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇవి చర్మానికి తాజాదనాన్ని అందించడంతో పాటు చర్మం పొడిబారకుండా కాపాడతాయి.

రోజ్ వాటర్‌తో చర్మ సౌందర్యం
చర్మ సౌందర్యాన్ని పెంచుకునేందుకు రోజ్ వాటర్, అలోవెరా జ్యూస్ చాలా సహాయపడతాయి. ఒక గిన్నెలో కొంత మోతాదులో రోజ్ వాటర్ తీసుకోవాలి. వేడి చేసిన తర్వాత వాటిల్లో గులాబీ రేకులను కలపాలి. అవి కలిసిపోయేలా తిప్పిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జ్యూస్ కలపాలి. ఆ తర్వాత అవి చల్లారే వరకు వేచి ఉండాలి. చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై మర్దన చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకోవచ్చు. ఇలా కొద్దిరోజుల పాటు మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి.

ABOUT THE AUTHOR

...view details