Sitting health risks: కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి..అదే పనిగా కూర్చుంటే మాత్రం శరీరం గుల్ల కావడం ఖాయం.. అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగక తప్పదు. 'చక్కగా ఆఫీస్‌లో ఫ్యాన్ కింద కూర్చుంటావ్.. నీ కేంటీ బాబూ' అని వ్యంగ్యంగా స్నేహితులు అనే మాటలకు అర్థాలే మారిపోతున్నాయి. ఉల్లాసం, విలాసం సంగతి పక్కన పెడితే ఎక్కువ సేపు కూర్చొవడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
అదే పనిగా కూర్చుంటే ఎన్ని అనర్థాలో తెలుసా..? - అదే పనిగా కూర్చుంటే ఎన్ని అనర్థాలో
Sitting health risks: అదేపనిగా గంటలపాటు కుర్చీలో కూర్చోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. మరి పని ఉన్నా లేకున్నా కుర్చీకి అతుక్కుపోతే అనారోగ్యం తప్పదని అంటున్నారు వైద్యులు.
అదే పనిగా కూర్చుంటే ఎన్ని అనర్థాలో తెలుసా
కుర్చీకి అతుక్కుపోతే అనారోగ్యం
- పని ఉన్నా లేకపోయినా కుర్చీ నుంచి కదలకపోతే అనర్థమే..శారీరక శ్రమ, వ్యాయామం లేకపోతే ఇబ్బందులు వస్తాయి.
- ఊబకాయం, మధుమేహం ముప్పు తప్పదు.
- వెన్నెముక దెబ్బతినే అవకాశం ఉంది.
- తుంటి కండరాలు బిగుసుకొని పోయి తొడ కండరాలు పట్టేస్తాయి.
- రక్త నాళాల్లో రక్తం నిల్వ ఉండిపోయి సిరలు ఉబ్బి పోవచ్చు. లోపలి సిరల్లో చిన్న చిన్న రక్తపు గడ్డలు కడతాయి. ఇది ఊపిరితిత్తుల వరకు చేరితే ప్రాణాపాయం తలెత్తవచ్చు.
- శరీరంలో అధికంగా ఉన్న ద్రవాలను లింప్ వ్యవస్థ బయటకు పంపిస్తుంది. కదలకుండా కూర్చొవడంతో లింప్ వ్యవస్థ అస్థవ్యస్థంగా మారుతుంది.
- మొహం, కళ్లు ఉబ్బినట్టుగా కనిపిస్తాయి. తరచూ నిస్సత్తువతో కూడిన తలనొప్పి వేధిస్తుంది.
- పేగుల కదలిక తగ్గిపోవడంతో జీర్ణక్రియ సరిగా పని చేయదు.
- కడుపు,ఊపిరితిత్తుల మధ్య ఉండే డయాఫ్రం పొర కదలికలు తగ్గుతాయి. దీంతో ఊపిరి తిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది.
- ఎక్కువ సేపు కూర్చొవాల్సి వస్తే గంటకోసారి కొద్దిసేపు నడవాలి. ఇంటి దగ్గర వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి.