అలా ఉంటే సమస్యే!
సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే చాలామందికి కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. అయితే చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకోగానే ఉబ్బిన కళ్లు మళ్లీ మామూలుగా అయిపోతాయి. అయితే నీటితో శుభ్రపరచుకున్న తర్వాత కూడా కళ్లు ఉబ్బినట్లుగానే ఉంటే ఏదో సమస్య ఉందని అర్థం అని చెబుతున్నారు నిపుణులు. ఈక్రమంలో కొన్ని సహజ చిట్కాలు పాటించడం ద్వారా ఉబ్బిన కళ్ల నుంచి ఉపశమనం పొందవచ్చని వారు సూచిస్తున్నారు.
ఇలా బయటపడండి!
- శరీరం డీహైడ్రేషన్‌కు గురైనా కళ్లు ఉబ్బినట్లుగా కనిపిస్తాయట! అందుకే నీళ్లు ఎక్కువగా తాగమంటున్నారు నిపుణులు.
- నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.
- టీ, కాఫీ, కార్బొనేటెడ్ ఎనర్జీ డ్రింకులు, ఆల్కహాల్... తదితర పానీయాలను తరచుగా తీసుకోవడం వల్ల కళ్లు ఉబ్బిపోయి అందవిహీనంగా తయారవుతాయి. కాబట్టి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండడం మంచిది.
- కొత్తిమీరను డైట్‌లో చేర్చుకోవడం వల్ల వేగంగా ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఎందుకంటే కొత్తిమీర మూత్ర పిండాల ద్వారా వ్యర్థ పదార్థాలు, మలినాలను వడపోసి బయటకు పంపించేస్తుంది. సలాడ్లు, సూప్స్‌లలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతం చేసుకోవచ్చు. ఈక్రమంలో దోసకాయ, కొత్తిమీర, టొమాటో... తదితర పదార్థాలతో తయారుచేసిన జ్యూస్‌ను తీసుకోవడం వల్ల ఉబ్బిన కళ్ల నుంచి వేగంగా ఉపశమనం పొందవచ్చు. మరి ఆ జ్యూస్ తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు
- దోసకాయ-1
- వాము ఆకులు-2
- టొమాటో-1
- కొత్తిమీర- కొంచెం
- నిమ్మరసం- టీస్పూన్