తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కొవిడ్‌కు, మధుమేహానికి మధ్య సారూప్యతలు - Diabetes and Covid-19

కొవిడ్‌, టైప్‌-2 మధుమేహానికి సంబంధించిన జీవరసాయన చర్యల్లో సారూప్యతలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కొవిడ్‌ చికిత్సకు కొత్త విధానాలకు సిద్ధం చేయడానికి ఈ ఆవిష్కరణ వీలు కల్పిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

Similarities between the Covid and the Diabetes
కొవిడ్‌కు, మధుమేహానికి మధ్య సారూప్యతలు

By

Published : Apr 19, 2020, 10:09 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా, రెండో రకం మధుమేహానికి సంబంధించిన జీవరసాయన చర్యల్లో సారూప్యతలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా మధుమేహం, ఊబకాయం ఉన్నవారు ఇన్‌ఫ్లూయంజా రుగ్మతల ప్రభావానికి గురవుతుంటారు. కొవిడ్‌ రోగుల్లో ఆరోగ్యం విషమించడానికి ఈ రెండు సమస్యలే ప్రధానంగా కారణమవుతున్నాయని కెనడాలోని మౌంట్‌ సైనాయ్‌ ఆసుపత్రి వైద్యులు వివరించారు.

కొవిడ్‌కు కారణమవుతున్న సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ ఊపిరితిత్తులు, పేగుల్లోని కొన్ని కణాల్లో తిష్ట వేయడం ద్వారా ఇన్‌ఫెక్షన్‌ను కలగజేస్తోంది. దీనివల్ల ఆ భాగాల్లో వాపు వస్తోంది. ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలు పలు ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ‘‘మానవ శరీరంలోకి ప్రవేశించడానికి, ఇన్‌ఫ్లమేషన్‌ కలిగించడానికి ఊపిరితిత్తులు, పేగుల్లోని కణాలను కరోనా వైరస్‌ ఉపయోగించుకుంటోంది. ఈ కణాలు యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2 (ఏసీఈ2), డైపెప్టైడల్‌ పెప్టిడేస్‌-4 (డీపీపీ4) అనే కీలక ప్రొటీన్లను వెలువరిస్తాయి. టైప్‌-2 మధుమేహం వృద్ధి చెందే సమయంలోనూ ఇవి కనిపిస్తాయి’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేనియల్‌ జె డ్రూకర్‌ చెప్పారు.

ఇదీ చదవండి:'24 గంటలూ అందుబాటులో సహాయక కేంద్రాలు'

Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details