తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కుక్కలకు పచ్చి మాంసం తినిపిస్తున్నారా? మీకు ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

Side Effects With Feeding Raw Meat to Dogs : ఇళ్లలో కుక్కలను పెంచుకోవడం ఇప్పుడు ఒక స్టేటస్. వాటిని కూడా ఫ్యామిలీ మెంబర్​గా ట్రీట్ చేస్తుంటారు చాలా మంది. ఈ క్రమంలో వాటికి స్పెషల్ మెనూ కూడా సిద్ధం చేస్తారు. ఇందులో పచ్చి మాంసం కూడా ఉంటుంది! మరి.. కుక్కలకు ఇలా పచ్చి మాంసం పెట్టడం వల్ల మనుషులకు ప్రమాదం పొంచి ఉందని తెలుసా?

Side_Effects_of_Feed_Raw_Meat_to_Dogs

By ETV Bharat Telugu Team

Published : Nov 26, 2023, 2:09 PM IST

Side Effects With Feeding Raw Meat to Dogs : ఈరోజుల్లో కుక్కల్ని పెంచుకోవడం కామన్‌. విశ్వాసానికి ప్రతీకగా నిలిచే కుక్కలు.. బెస్ట్‌ స్ట్రెస్‌ బస్టర్‌గానూ ఉంటాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే చాలా మంది తమ ఇంట్లోని కుక్కలను.. ఫ్యామిలీ మెంబర్​గా కూడా ట్రీట్‌ చేస్తుంటారు. అయితే.. వాటికి పెట్టే భోజనం గురించి ఓ కీలక విషయం చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. కుక్కలు పచ్చి మాంసం తినడం వల్ల.. మనుషులకు సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి.. అవేంటి? నిపుణులు చేస్తున్న సూచనలేంటి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..

కుక్కలు ఎందుకు వాహనాలను వెంటాడుతాయి? కారణాలు తెలిస్తే షాకే!

కుక్కలకు పచ్చి మాంసం పెట్టడం వల్ల నష్టాలు:పచ్చి మాంసం తిన్న కుక్కలు.. E.కోలి బ్యాక్టీరియాను విసర్జిస్తాయట. ఈ బ్యాక్టీరియా Fluoroquinolones అనే యాంటీ బయాటిక్​ను సైతం డామినేట్ చేస్తుందట! సాధారణంగా.. ఈ Fluoroquinolones అనే యాంటిబయాటిక్స్‌ను మనుషులతోపాటు, పశువైద్యంలోనూ ఉపయోగిస్తారు. అలాంటి యాంటీబయాటిక్​ను నిరోధించే బ్యాక్టీరియాను.. పచ్చిమాంసం తిన్న కుక్కలు విసర్జిస్తుండడంతో మనుషుల్లో ఇన్ఫెక్షన్​ ముప్పు పెరిగిపోతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేకు చెందిన సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందట.

పరగడపున టీ లేదా కాఫీ తాగుతున్నారా? ఇది తెలియకపోతే డేంజర్​లో పడ్డట్లే!

హెల్తీగా ఉన్న దాదాపు 600 కుక్కలను పరిశీలించామని.. వాటి నమూనాల్లో E.కోలి బ్యాక్టీరియా రకాన్ని గుర్తించామని సైంటిస్టులు తెలిపారు. పరిశుభ్రత సరిగా లేని పచ్చి మాంసం తినడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని గుర్తించినట్టు చెప్పారు. ఈ బ్యాక్టీరియా వల్ల యాంటిబయాటిక్స్‌ పవర్ తగ్గిపోతుందని, దాంతో.. బ్యాక్టీరియా ఇతర శరీర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉందని సైంటిస్టులు గుర్తించారు.

పచ్చి మాంసాన్ని కుక్కలకు స్వయంగా తినిపించం వల్ల మనుషుల్లోనూ అనేక ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నట్టు తేలిందట! ఈ బ్యాక్టీరియా మనుషుల పేగుల్లో కొన్ని సంవత్సరాల పాటు నిల్వ ఉంటుందని.. ఆ తర్వాత ట్రీట్‌మెంట్‌ అందివ్వడానికి సైతం కష్టమయ్యే పరిస్థితి తలెత్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సైంటిస్టులు జరిపిన ఈ అధ్యయనంలో.. సుమారు 7.3% గ్రామీణ కుక్కలు, 11.8% పట్టణాల్లో కుక్కల మలంలో E. కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారట. పచ్చి మాంసం తినిపించడమే ఈ బాక్టీరియాకు కారణమని వారు తేల్చారు.

Ginger Side Effects In Telugu : అల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త సుమా!

ఇవి కూడా పెట్టకూడదు..

  • కుక్కలకు పచ్చి మాంసంతోపాటు చెర్రీ పండ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్ట కూడదట.
  • చెర్రీ పళ్లు కుక్కలపై విష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది. వీటివల్ల కుక్కల రక్త కణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందట.
  • చెర్రీ పళ్ల వల్ల కుక్కలకు కంటి చూపు సమస్య, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందట.
  • ద్రాక్ష పళ్లు కూడా కుక్కలకు విషం లాంటివని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వీటి వల్ల కుక్కల కిడ్నీలు పాడైపోయే అవకాశం ఉంటుందట.
  • కుక్కలకు టమాటలను పెట్టడం కూడా మంచిది కాదు. ఎక్కువ మొత్తంలో పెడితే మాత్రం అందులోని సొలనైన్ అనే పదార్థం కుక్కలపై చెడు ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుందట.
  • ఉల్లిగడ్డలు, మష్రూమ్ లను కూడా కుక్కలకు ఆహారంగా పెట్టకూడదట. ఇవి కూడా ఆరోగ్యాన్ని పాడుచేసే అవకాశం ఉందట.

Vitamin D Tablets Side Effects : విటమిన్-డి మాత్రలు ఎక్కువగా వాడేస్తున్నారా?.. ఆ '10' లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details