తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

గుండె నొప్పి ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండాలా?

గుండె జబ్బు ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండాలా?. ఒకవేళ పాల్గొంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సందేహాలపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

Should People With Heart Disease Stay Away From Sex?
Should People With Heart Disease Stay Away From Sex?

By

Published : Jun 8, 2022, 7:55 AM IST

Sex Education: సృష్టి మనకిచ్చిన అద్భుతమైన వరాల్లో శృంగారం కూడా ఒకటి. ఆడ, మగ కలయికలో అంతులేని ఆనందం ఉంటుంది. అయితే సెక్స్​ విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉంటాయి. వాటి గురించి ఎవ్వరినీ అడగలేక.. తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. సాధారణంగా కొంతమంది కొన్ని కారణాల దృష్ట్యా గుండె జబ్బు బారినపడతారు. అందుకు తగిన చికిత్స కూడా తీసుకుంటారు. కానీ గుండె జబ్బు ఉన్నవారు శృంగారానికి దూరంగా ఉండాలనే అపోహతో ఉంటారు.. అయితే వీటిపై నిపుణులు ఏమని చెబుతున్నారంటే?

"గుండె సమస్యలు ఉన్నవారు.. సెక్స్​లో పాల్గొనే సమయంలో కాస్త గుండెలో చిన్న నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది. అలాంటి వారు శృంగారంలో పాల్గొనే 15 నిమిషాల ముందు సార్బిటేట్​ మాత్రలు తీసుకోవాలి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే శృంగారంలో పాల్గొన్న సమయంలో కొంతమందికి మరీ ఎక్కువగా గుండెనొప్పి వస్తుంటుంది. అలాంటి వాళ్లు కింద పడుకోవాలి.. భాగస్వామినిపైన పడుకోబెట్టుకోవాలి. దాంతో పాటు సెక్స్​ పొజిషన్స్​లో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది." అని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details