తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

బీపీ ఎక్కువగా ఉంటే శృంగారంలో పాల్గొనకూడదా?

ప్రస్తుత రోజుల్లో చాలా మందిని బీపీ సమస్య వేధిస్తోంది. కాగా, రక్తపోటు ఎక్కువగా ఉంటే శృంగారంలో పాల్గొనకూడదని అంటుంటారు. దీనిపై డాక్టర్లు ఏం చెబుతున్నారంటే!

samaram sex news
సెక్స్​ సందేహాలు

By

Published : Oct 2, 2021, 11:21 AM IST

బీపీ స్థాయిని బట్టి సెక్స్​లో పాల్గొనాలా? లేదా? అని చెప్పొచ్చు. సాధారణంగా బీపీలో మూడు స్థాయిలు ఉంటాయి. బీపీ తీవ్ర స్థాయిలో ఉన్నవారు మాత్రం శృంగారంలో పాల్గొనకపోవడమే మంచిది. రక్తపోటు తక్కువ అయ్యేవరకు సెక్స్​కు దూరంగా ఉండాలి.

సెక్స్​లో పాల్గొనేప్పుడు ఉద్రేకం కారణంగా పూర్తి ఆరోగ్యవంతులకు కూడా బీపీ పెరుగుతుంది. వీర్యం పడిపోగానే రక్తపోటు మళ్లీ సాధారణ స్థాయికి వస్తుంది. కానీ బీపీ, కొలెస్ట్రాల్​ ఎక్కువగా ఉన్నవారు శృంగారంలో పాల్గొంటే రక్తనాళాలు పాడైపోతాయి. మెదడు, గుండెలో నాళాలు చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది. బీపీ తక్కవ కాగానే శృంగారంలో పాల్గొనొచ్చు. బీపీ తక్కవ కాకపోతే డాక్టర్​ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

స్ఖలనం కాకుండానే అంగం డీలా పడిపోతుందా?

శృంగారంపై ప్రేరణ కలిగినప్పుడు సాధారణంగా అంగం స్తంభిస్తుంది. వీర్యం పడిపోగానే డీలా పడిపోతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. కానీ కొందరిలో స్ఖలనం కాకుండానే డీలా పడిపోతుంది. దీనికి కారణం వారి మానసిక స్థితే. భాగస్వామిపై ఆసక్తి లేకపోవడం వల్ల అంగస్తంభన ఉండదు. దీంతో స్ఖలనం కాకుండానే అంగం డీలా పడిపోతుంది.

  • పక్షవాతం, పోలియో ఉన్నవాళ్లు సెక్స్​ చేయలేరా?
  • పెళ్లికి ముందే సెక్స్​ బలహీనత తెలుసుకోవడం ఎలా?
  • వీర్యం అధికంగా పోతే సెక్స్​ బలహీనత వస్తుందా?
  • ఈ మధ్య తరచుగా కాళ్లు, చేతులు లాగుతున్నాయి. నరాల బలహీనత ఉన్నట్లా? సెక్స్​ చేయలేమా?
  • గనేరియా వ్యాధితో నా భార్యతో సెక్స్​లో పాల్గొన్నాను. ఆమె కూడా మందులు వాడాలా?

ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూడండి.

ఇదీ చదవండి:వైవాహిక జీవితంలో శృంగారం తప్పనిసరా?

ABOUT THE AUTHOR

...view details