ఉదయం లేచింది మొదలు ఉద్యోగాల్లో నిమగ్నమైపోతుంటాం. నిత్యం ఏసీల్లో పనిచేస్తుంటాం. కాస్త ఎండ, ఉబ్బరం ఎక్కువగా ఉంటే ఏసీని మరింత పెంచాల్సి వస్తుంది. ఇది కొందరిలో (anti allergy medicine) అలర్జీకి కారణమౌతుంది. మరి అలాంటివారు నిత్యం మందులు వాడాల్సిందేనని అనుకుంటారు. కానీ డాక్టర్ల సూచనలతో చిన్న చిట్కాలతో సమస్యను తగ్గించవచ్చు.
అలర్జీకి జీవితాంతం మందులు వాడాల్సిందేనా? - అలర్జీకి మందులు
ఏమాత్రం ఏసీ ఎక్కువైనా కొంతమందిలో ముక్కు దిబ్బడ, అలర్జీ (anti allergy medicine) మొదలవుతాయి. అలాంటివారు నిరంతరం మందులు వాడాల్సిందేనని భ్రమపడుతుంటారు. మరి డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
ఏసీ ఎక్కువయితే కొందరిలో అలర్జీ(anti allergy medicine) మొదలవుతుంది. కానీ అది శాశ్వతంగా ఉంటుందని అనుకోలేం. రెండు, మూడు వారాలపాటు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ అలర్జీ ఎందుకు వస్తుందని మనం తెలుసుకోగలగాలి. ఏసీ వల్ల వస్తుందనుకుంటే కొంచెం తగ్గించాలి. ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. ఏసీ, దుమ్ము ధూళి తదితర కారణాలుంటాయి. రోగ నిరోధకత తగ్గిపోవటం, ఎక్కువ ఒత్తిడి కూడా ఇందుకు ఓ కారణమే. విటమిన్ 'డి' ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే అలర్జీని తగ్గించవచ్చు.
ఇదీ చదవండి:పేరెంట్స్‌లో అలర్జీలుంటే అవి పుట్టే పిల్లలకు వస్తాయా?