తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

మగవారిలో సెక్స్​ బలహీనతకు అదే ప్రధాన కారణమా? - శారీరక ఆరోగ్య సమస్యలు

sex weakness: ప్రతి ఒక్కరూ రతిలో ఆనందాన్ని పొందాలని కోరుకుంటారు. కానీ కొందరు మగవారిలో మాత్రం సెక్స్​ బలహీనతలు ఉంటాయి. వాటి వల్ల వారు ఎప్పుడూ బాధ పడుతుంటారు. అధిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక కారణాల వల్ల ఇలా జరగొచ్చని అంటున్నారు నిపుణులు. అలాగే శీఘ్రస్కలనం, బీపీ, మధుమేహం వంటి వ్యాధుల వల్ల కూడా మగవారిలో సెక్స్ బలహీనతకు కారణమవుతాయని అంటున్నారు.

men sex
మగవారిలో సెక్స్​ బలహీనతలు

By

Published : May 1, 2022, 7:40 AM IST

sex weakness: రతిలో ఆనందాన్ని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొందరిలో మాత్రం కొన్ని రకాల కారణాల వల్ల రతిలో ఇబ్బందులు పడతారు. ముఖ్యంగా మగవారిలో శీఘ్రస్కలన సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. రతిలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం అనేది దీనిలో ప్రధాన సమస్య. మనలో కలిగే ఒక విధమైన ఉద్యేగం కారణంగా ఇది ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు. శీఘ్రస్కలనం అంటే శృంగారంలో పాల్గొన్న పురుషుడు త్వరగా అంతిమ దశకు చేరుకోవడం. ఈ ప్రక్రియ భాగస్వామిని నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఇది మగవారు రతిలో పాల్గొన్నప్పుడు తొందరపాటుకు గురైతే ఇలా జరుగుతుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు భయం, ఆందోళన, కంగారు, గాబర వంటివి ఉంటే ఇది చోటుచేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే.. చాలామందికి ఓ అపోహ ఉంది. రతిలో ఎక్కువగా పాల్గొన్నా.. మగ వారికి సెక్స్​ బలహీనత ఏర్పడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరైతే సెక్స్​లో చక్కగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొంటారో వారికి ఆరోగ్యం చాలా బాగుంటుందని అంటున్నారు. ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఎందుకంటే శృంగారంలో పాల్గొంటే ఫీల్​గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. డోపమిన్​, సెరొటెనిన్​, ఎండార్ఫిన్​, ఆక్సిటోసిన్​, లాంటి హార్మోన్లు విడుదలవుతాయి. అంతేకాక రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ చేయలేకపోవడానికి గల కారణం నరాల బలహీనత అనుకోవడం పోరపాటే అవుతుంది. నరాల బలహీనతకు, రతికి అసలు సంబంధం లేదు.

ABOUT THE AUTHOR

...view details