తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

Sex During Pregnancy In Telugu : భార్యాభర్తల మదిలో సెక్స్ గురించి చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా గర్భంతో ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొనవచ్చా? లేదా? అని ఆలోచిస్తూ ఉంటారు. మరి దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారు? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Sex During Pregnancy
Sex In Pregnancy Is Good Or Bad

By ETV Bharat Telugu Team

Published : Oct 14, 2023, 5:16 PM IST

Updated : Oct 14, 2023, 6:36 PM IST

Sex During Pregnancy : మహిళలు గర్భంతో ఉన్నప్పుడు వారి మనసులో చాలా సందేహాలుంటాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వ్యాయామం చేస్తే ఏమవుతుంది? తదితర విషయాలపై కాస్త కంగారు పడుతుంటారు. మరికొన్ని విషయాల్లో స్పష్టత లేక పలు అపోహలు నమ్ముతుంటారు. అందులో శృంగారం కూడా ఒకటి. ఆరోగ్యానికి, అనుబంధానికి సంబంధించి ఈ కీలకమైన శృంగార ప్రక్రియను గర్భం ధరించాక కొనసాగించవచ్చో, లేదో అన్న సందేహం చాలామంది గర్భిణిల్లో తలెత్తడం సహజం. ఇదొక్కటనే కాదు.. ప్రెగ్నెన్సీలో కలయికకు సంబంధించిన మరెన్నో సందేహాలు వాళ్ల మదిలో మెదులుతుంటాయి. ఇంతకీ గర్భంతో ఉన్నప్పుడు శృంగారం చేయవచ్చా? లేదా? అనే విషయాన్ని తెలుసుకుందాం రండి..

ఆ జోన్‌లో లేని వారే..!
కొంతమంది గర్భం ధరించాక అతి సుకుమారంగా వ్యవహరిస్తుంటారు. అడుగు తీసి అడుగు వేయడానికే జంకుతుంటారు. అలాంటిది శృంగారమంటే? అసలు ఆ ఆలోచనే దరికి రానివ్వరు. దీనివల్ల కడుపులో ఉన్న బిడ్డకు సమస్యలేవైనా వస్తాయేమోనని! కానీ హైరిస్క్‌ జోన్‌లో లేని జంటలు.. డాక్టర్‌ సలహాను అనుసరించి భయం లేకుండా కలయికలో పాల్గొనచ్చని చెబుతున్నారు నిపుణులు. ఈ ప్రక్రియ ఏ రకంగానూ బిడ్డ ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపదని వారు ఉంటున్నారు. అయితే ఇక్కడ గర్భిణిసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్లడం మాత్రం తప్పనిసరని గుర్తుంచుకోవాలి. అలాగే పొట్టపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ఈ విషయంలో లోతైన సందేహాలేమైనా ఉంటే వైద్యున్ని సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.

ప్రీ-మెచ్యూర్‌ డెలివరీ అవుతుందా?
గర్భం ధరించాక శృంగారంలో పాల్గొంటే ప్రారంభ దశలో గర్భస్రావం అవుతుందని, నెలలు నిండే కొద్దీ ప్రీ-మెచ్యూర్‌ డెలివరీ అవుతుందేమోనని చాలామంది భయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కానీ ఈ రెండూ నిజం కాదు అని చెబుతున్నారు నిపుణులు. కలయిక తర్వాత వెజైనా దగ్గర నొప్పి, అసౌకర్యం కలుగుతుంది. ఇది చాలా సహజంగా జరిగేదే. ఇది మినహా శృంగారం వల్ల ఇతర దుష్ప్రభావాలు ఏమీ కలగవని వైద్యులు చెబుతున్నారు.

ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి?
గర్భంతో ఉన్నప్పుడు అందరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. ముందుగా మీ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్‌ వద్ద చెకప్‌ చేయించుకోవాలి. దీని వల్ల శృంగారంలో పాల్గొనవచ్చా? లేదా? అనే విషయంలో ఒక స్పష్టతకు వస్తుంది.

ఇన్ఫెక్షన్ల ముప్పు ఎంత?
మహిళలు గర్భంతో ఉన్నప్పుడు.. ముఖ్యంగా శృంగారం విషయంలో చాలా భయపడతారు. ఎందుకంటే తమ భాగస్వామి నుంచి సెక్స్​ ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనని ఆందోళన చెందుతారు. తద్వారా అవి తమ కడుపులోని బిడ్డకు ఎక్కడ చేటు చేస్తాయేమోనని భావిస్తారు. అయితే భాగస్వామిలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేకుంటే.. సెక్స్​ చేసినా ఎలాంటి ఇబ్బందీ ఏర్పడదని నిపుణులు చెబుతున్నారు. అదే ఇన్ఫెక్షన్లు, లైంగికంగా సంక్రమించే వ్యాధులు ఉంటే మాత్రం.. వాళ్లను పూర్తిగా దూరం పెట్టడమే ఉత్తమమని అంటున్నారు. ఇలాంటప్పుడు కొంతమంది కండోమ్స్‌ వంటి సురక్షిత పద్ధతులు అవలంబిస్తుంటారు. కానీ ఆ రిస్క్‌ కూడా చేయకపోవడమే మంచిదని నిపుణుల అభిప్రాయం. ఇక మహిళలు కూడా చక్కటి వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ఏ మాత్రం మర్చిపోకూడదు.

Planning To Conceive : ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేస్తున్నారా? ఆ మాత్రల విషయంలో జాగ్రత్త!

ప్రయోజనాలివే!
Sex While Pregnancy Benefits :గర్భంతో ఉన్న మహిళలు శృంగారం చేయడం వల్ల పలు ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..!

  • శృంగారం వల్ల జననేంద్రియాలకు రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా అక్కడి కండరాలు దృఢంగా తయారవుతాయి. ఆయా భాగాల్లో ఉండే చిన్న చిన్న సమస్యలు సైతం దూరమవుతాయి.
  • కలయికతో దంపతుల మధ్య దూరం తగ్గుతుంది. దీంతో అనుబంధం రెట్టింపు అవుతుంది.
  • ఈ సమయంలో శృగారంలో పాల్గొంటే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులు, క్యాలరీలు కరగుతాయి. దీంతో గర్భిణీలు ఫిట్‌గా, చురుగ్గా ఉంటారు.
  • శృంగారంతో వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కనుక గర్భిణీలు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే మీ సౌకర్యం, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని శృంగారంలో పాల్గొనడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
  • సెక్స్​లో పాల్గొనడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి హ్యాపీ హార్మోన్లు కనుక.. తల్లీబిడ్డలిద్దరూ రిలాక్స్​ అవ్వవచ్చు.

వీళ్లు చేయవద్దు!

  • హైరిస్క్‌ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళలే కాదు.. మరికొంతమంది సైతం గర్భధారణ సమయంలో శృంగారానికి దూరంగా ఉండడమే మేలని నిపుణులు చెబుతున్నారు.
  • వెజైనా సమస్యలతో బాధపడుతున్నవారు.
  • కడుపులో కవలలు పెరుగుతున్నట్లయితే..
  • గర్భ సంచి వదులుగా ఉండి కుట్లు వేయించుకున్న మహిళలు..
  • వెజైనా నుంచి బ్లీడింగ్‌, ఉమ్మనీరు, వైట్‌ డిశ్చార్జి అవుతుంటే..
  • గతంలో ప్రీ-మెచ్యూర్‌ డెలివరీ అయిన వారు కూడా గర్భస్థ సమయంలో శృంగారానికి దూరంగా ఉండాలి.

ఎంత ఆరోగ్యకరమైన ప్రెగ్నెన్సీ అయినా.. సౌకర్యంగా అనిపించినంత వరకు మాత్రమే శృంగార ప్రక్రియను కొనసాగింటాలి. అలాగే ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, అపోహలున్నా వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి. కలయిక సమయంలో బ్లీడింగ్‌ జరిగినా, నొప్పిగా అనిపించినా సంకోచం లేకుండా తగిన చికిత్స తీసుకోవాలి. ముఖ్యంగా వైద్యులు ఇచ్చే సలహాలు పాటించడం అన్ని విధాలా శ్రేయస్కరం!

Vitamin Benefits Chart : సెక్స్ సామర్థ్యం పెంచే విటమిన్ ఏది? వేటితో ఏం ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Vitamin E Health Benefits In Telugu : చర్మం, జుట్టు ఆరోగ్యం కోసం విటమిన్-ఇ.. ఎక్కువైనా ప్రమాదమే!

Last Updated : Oct 14, 2023, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details