Semolina Health Benefits : అత్యంత ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల్లో బొంబాయి రవ్వ ఒకటి. ముఖ్యంగా ఇది శరీరం బరువును నియంత్రణలో ఉంచుతుంది. అంటే బరువు పెరగకుండా కాపాడుతుంది. బొంబాయి రవ్వలో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్- బి ఉంటాయి. ఇందులో శరీర బరువును తగ్గించేందుకు అవసరమైన పోషకాలు చాలా ఉంటాయి. అదే సమయంలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారు.. తమ రోజువారీ భోజనంలో బొంబాయి రవ్వను తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
షుగర్ నియంత్రణలో ఉంటుంది!
Semolina For Diabetes Patients : బొంబాయి రవ్వను తీసుకుంటే.. చాలా సమయంపాటు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకే స్నాక్స్ సమయంలో బొంబాయి రవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనం తీసుకునే ఆహారం త్వరగా చక్కెరగా మారకుండా బొంబాయి రవ్వ చూస్తుంది. దీని వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ప్రతి రోజూ బొంబాయి రవ్వను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోషకాలు పుష్కలం
Semolina Nutritional Value : బొంబాయి రవ్వలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, విటమిన్ -బితో పాటు ఫోలేట్, నియాసిన్ కూడా ఉంటాయి. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంతో పాటు, రక్తాన్ని ఆరోగ్యకరంగా ఉంచడంలో ఈ పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే శరీరంలోని అన్ని భాగాలు.. తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంలో తోడ్పడతాయి.