తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్‌ ప్రభావం? - కరోనా వైరస్ లక్షణాలు

కరోనా అంటురోగం నుంచి కోలుకున్న వారిలో... దీర్ఘకాలంలో తలెత్తే ఆరోగ్య సమస్యలపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టిసారిస్తున్నారు. ఈ మహమ్మారి వైరస్‌ దీర్ఘకాలంలో రోగి ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరును దెబ్బతీయొచ్చని అనుమానిస్తున్నారు.

coronavirus can damage patient's lungs and kidney function in the long period
దీర్ఘకాలంలోనూ కరోనా వైరస్‌ ప్రభావం?

By

Published : Apr 19, 2020, 9:12 AM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

కరోనా వైరస్‌ బారిన పడినా, కోలుకుంటున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా మెరుగ్గానే ఉంటోంది. అలా కోలుకున్న వారిలో దీర్ఘకాలంలో తలెత్తే ఆరోగ్య సమస్యలపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టిసారిస్తున్నారు. ఈ వైరస్‌ దీర్ఘకాలంలో రోగి ఊపిరితిత్తులు, మూత్రపిండాల పనితీరును దెబ్బతీయొచ్చని అనుమానిస్తున్నారు.

  • సాధారణంగా ఊపిరితిత్తుల సమస్యలుంటే పొడి దగ్గు, జ్వరం వచ్చి త్వరగానే కోలుకుంటుంటారు. దీర్ఘకాలిక సమస్యలేమీ ఉండవు. అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్నాక కొందరు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, న్యుమోనియాకు గురవుతున్నారని గుర్తించారు.
  • వైరస్‌ శరీరంలోకి ప్రవేశించాక శ్వాసనాళంపై తొలి ప్రభావం చూపుతుంది. తర్వాత వైరస్‌ను వృద్ధి చేసుకోవడం, రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీయడం, ఊపిరితిత్తుల పనితీరును తగ్గించడం చేస్తుంది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ప్రతిస్పందన వేగవంతమయ్యే క్రమంలో పెరిగే ద్రవం ఊపిరితిత్తుల్ని నింపేస్తుంది. కనీసం 14% మందిలో ఇలా జరుగుతోంది. ద్రవం పోగుపడటంతో న్యుమోనియా వచ్చి, శ్వాసతీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారినే వెంటిలేటర్‌పై ఉంచాల్సి వస్తోంది.
  • రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడంతో తలెత్తే వాపు ప్రక్రియ ఊపిరితిత్తులకు ప్రమాదం. ఇది సున్నితమైన గాలి గదులకు(అల్వియోలి) తీరని నష్టం చేస్తుంది. శ్వాస తీసుకున్నప్పుడు శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్‌ సరఫరాలో గాలి గదులే కీలకం. ఇది దెబ్బతింటే ఊపిరితిత్తులు గట్టి పడతాయి. ఈ క్రమంలో పెరిగిపోయే ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోని చాలా అవయవాలపై ప్రభావం చూపుతుంది. మూత్రపిండాలు సైతం దెబ్బతింటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే ఊపిరితిత్తుల్లో ద్రవం చేరకుండా వైద్యులు జాగ్రత్తగా చికిత్స అందించగలగాలి. కాకపోతే కొవిడ్‌ కొత్త వ్యాధి కావడంతో శాస్త్రవేత్తలు దాని గురించి నేటికీ ప్రతిరోజూ తెలుసుకుంటూనే ఉన్నారు. ఈ వైరస్‌ శరీరంలో వ్యాపించాక ఎంత విస్తృతంగా నష్టం చేస్తుందన్నది ఇంకా తేలనేలేదు. ఇన్‌ఫెక్షన్లు ఏవైనా వాటి పూర్తి ప్రభావాన్ని వెంటనే చూపడం అరుదు.
Last Updated : May 21, 2020, 4:50 PM IST

ABOUT THE AUTHOR

...view details