తెలంగాణ

telangana

By

Published : May 16, 2023, 1:15 PM IST

ETV Bharat / sukhibhava

సబ్జా గింజలతో వేడే కాదు మధుమేహం ఔట్​​.. అందాన్ని కూడా ఇస్తుందట!

Sabja Seeds Health Benefits : శరీరంలోని వేడిని తగ్గించుకునేందుకు చాలామంది సబ్జా గింజలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఒంట్లోని వేడిని తగ్గించడమే కాకుండా సబ్జాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

sabja-seeds-health-benefits-what-happens-if-we-eat-sabja-seeds-daily
సబ్జా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Sabja Seeds Health Benefits : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భానుడు ఒక్కసారిగా తన ప్రతాపాన్ని పెంచడం వల్ల ఎండలు మరింతగా పెరిగిపోయాయి. మొన్నటివరకు వర్షాలతో ఇబ్బంది పడ్డ ప్రజలు.. ఇప్పుడు వడగాల్పులు, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి ఎండలు బెంబేలెత్తిస్తుండటం వల్ల.. ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు.

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చలువ చేసే పదార్ధాలను చాలామంది తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిల్లో సబ్జా గింజలు కూడా ఒకటి. వేసవి కాలంలో సబ్జలు తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇవే కాకుండా సబ్జా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

  • సబ్జా గింజలు వాటి బరువు కన్నా ఏడెనిమిది రెట్లు ఎక్కువగా నీటిని పీల్చుకుంటాయి. వీటిని ఎండాకాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి నీటి శాతం ఎక్కువ లభిస్తుంది. దాంతో పాటు గొంతు తడి ఆరిపోకుండా ఉంటుంది. అందువల్లే ఎండాకాలంలో సబ్జా గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  • సబ్జాలలో ఎన్నో ఖనిజ లవణాలు ఉన్నాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, పాస్పరస్, మల్టీవిటమిన్లు లాంటి ఎన్నో పోషకాలు వీటిల్లో పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు సబ్జాలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. టైప్-2 డయాబెటిస్, కొలెస్ట్రాల్, ఒత్తిడి వంటి సమస్యలకు సబ్జాలతో చెక్ పెట్టేయవచ్చు.
  • సబ్జాలలో ఫైబర్ అధికశాతం ఉండటం వల్ల వీటిని తీసుకుంటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. దీని వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుంది. అలాగే సబ్జా గింజలను రోజూ తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. అలాగే సబ్జా గింజలలో పీచు పదార్ధం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ పీచు పదార్ధం వల్ల మలబద్దకం సమస్య కూడా దూరమవుతుంది. జీర్ణకోశంలో ఉండే సూక్ష్మజీవులను కూడా నాశనం చేసి జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఉపయోగపడతాయి.
  • ఇటీవల చాలామంది మధుమేహం వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. మధుమేహం వ్యాధిగ్రస్తులు రక్తంలోని షుగర్ స్థాయిలను అదుపులో పెట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారికి సబ్జా గింజలు చాలా సహయపడతాయి. సబ్జా గింజలలో ఉండే ఫైబర్ షుగర్ లెవల్స్‌ను వెంటనే తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి.
  • ఇక సబ్జాలను తీసుకోవడం వల్ల ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. వీటితో పాటు చర్మ, జుట్టు సౌందర్యాన్ని పెంచడంలో కూడా సబ్జా గింజలు చాలా ఉపయోగపడతాయట. సబ్జా గింజల ద్వారా ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. ఇవి సోరియాసిస్ వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి.
  • సబ్జా గింజలను నీళ్లల్లో నానబెట్టడం వల్ల మెత్తగా అవుతాయి. దీంతో వీటిని తీసుకోవడం వల్ల వెంటనే జీర్ణం అవుతాయి. అంతేకాకుండా యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సబ్జా గింజల్లో ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా రాకుండా అడ్డుకోవడంతో పాటు శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తోంది. అలాగే సబ్జా గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాల వల్ల క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
    సబ్జా గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • ఇవీ చదవండి:
  • నిద్రలేచిన వెంటనే బద్ధకంగా ఉంటుందా? ఈ సింపుల్​ ఆసనాలతో అంతా సెట్​!
  • పెరుగు తింటే బరువు తగ్గుతారా?.. ఇందులో నిజమెంత?

ABOUT THE AUTHOR

...view details