తెలంగాణ

telangana

బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 1:59 PM IST

Weight Loss Tips : ఈరోజుల్లో బరువు తగ్గాలనుకునే వారిలో ఎక్కువ మంది అన్నానికి బదులుగా రోటీ తింటున్నారు. అయితే.. నిజంగా రొట్టె తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారు?

Roti Vs Rice Which is Better for Weight Loss
Roti Vs Rice Which is Better for Weight Loss

Roti Vs Rice Which is Better for Weight Loss :బరువు తగ్గాలనుకునే వారు నైట్ టైమ్ అన్నం తినడం మానేసి.. రోటీలు తినడం స్టార్ట్ చేశారు. మరి.. నిజంగా రొట్టెలు తింటే వెయిట్ తగ్గుతారా? అన్నం తింటే బరువు పెరుగుతారా? ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది బెటర్? అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.

నిపుణులు ఏమంటున్నారు?

బియ్యం, రోటీ ఈ రెండింటి పోషక విలువల్లో చాలా తేడా ఉంది. బరువు తగ్గాలనేవారు రెండూ తినాలని సూచిస్తున్నారు. అయితే.. వారానికి 4 రోజులు రోటీ తింటే.. 2 రోజులు అన్నం తినాలి. ఈ విధంగా మీరు మీ డైట్​లో వెరైటీని కొనసాగించి వెయిట్ లాస్ అవ్వొచ్చని సూచిస్తున్నారు. అయితే.. గుర్తంచుకోవాల్సిన విషయం ఏమంటే.. బరువు తగ్గడం కోసం ఎప్పుడూ ఆకలితో ఉండకూడదట. ఇది మీ ఆరోగ్యాన్ని మరింత ప్రభావితం చేస్తుందంటున్నారు.

చపాతీలో గ్లూటెన్ ఉంటే.. బియ్యంలో ఉండదు. కొందరికి గ్లూటెన్ ఇష్టముండదు. అలాంటి వారు తక్కువ మొత్తంలో రోటీలు, ఎక్కువ అన్నం తీసుకోవడం బెటర్. అయితే.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అన్నం కంటే రోటీ ఎక్కువ మేలు చేస్తుందని అంటున్నారు. కాబట్టి మధుమేహం ఉన్నవారు అన్నం తినకపోవడం ఉత్తమం.

చలికాలంలో బద్ధకాన్ని వదిలి బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ టిప్స్​ ట్రై చేయండి!

ఏ రకమైన రోటీ ప్రయోజనకరం? :జొన్నలు, రాగులు, మిల్లెట్‌లతో చేసిన రోటీలు బరువు తగ్గడంలో ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ చపాతీల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ స్థాయి వేగంగా పెరగదు. జొన్నలు, రాగులు, బజ్రాలతో చేసిన రోటీలు చాలా పోషకమైనవి. కాబట్టి ఇవి బరువు తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయి.

ఏ బియ్యం మంచివి? : ఒకవేళ మీరు రైస్ తింటూ బరువు తగ్గాలనుకుంటే.. బ్రౌన్ రైస్ మంచి ఎంపికగా చెబుతున్నారు నిపుణులు. వైట్ రైస్​ కన్నా బ్రౌన్ రైస్ మంచి ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు.

బరువు తగ్గడానికి 10 ముఖ్యమైన చిట్కాలు :

  • మీ డైట్​లో ఫైబర్ తీసుకోవడం పెంచాలి. రోజువారీ 40 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి.
  • పుష్కలంగా నీరు తాగాలి. దాదాపు ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు తాగేలా చూసుకోవాలి.
  • మీ ఆహారంలో ఉప్పు, చక్కెర పరిమాణాన్ని తగ్గించాలి.
  • రిఫైన్డ్​, ప్రాసెస్ చేసిన, జంక్ ఫుడ్​కు వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
  • వంటల కోసం సీడ్స్ ఆయిల్ ఉపయోగించేలా చూసుకోవాలి.
  • రోజూ శారీరక శ్రమ ఉండేలా చూసుకోండి.
  • అలాగే డైలీ సరైన మార్గంలో వ్యాయామం చేస్తూ కండరాలలో శక్తిని పెంచుకోవాలి.
  • మీ జీవనశైలిలో బరువు తగ్గడానికి అవసరమైన కొన్ని మార్పులు చేసుకోండి.
  • ఆహారం, కూల్​డ్రింక్స్​ కంట్రోల్​లో ఉండేలా చూసుకోవాలి.
  • ఇక చివరగా వెయిట్ లాస్​కు మీరు పాటించాల్సిన మరో చిట్కా.. ధూమపానం, మద్యపానాన్ని మానుకోవాలి.
  • ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే త్వరలోనే మీ బాడీ వెయిట్​లో మార్పు గమనిస్తారు.

సడన్​గా బరువు పెరిగారా? - మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే! చెక్​ చేసుకోండి!

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

ABOUT THE AUTHOR

...view details