గులాబీ టీ
కావాల్సినవి:ఎండిన గులాబీలు- మూడు, గులాబీనీరు- టీస్పూన్, తేనె- రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మరసం- అర టీస్పూన్, నీళ్లు- లీటర్, గ్రీన్‌టీబ్యాగ్‌లు- రెండు
తయారీ: పావు లీటరు నీటిని బాగా మరిగించి గులాబీరేకలు, నిమ్మరసం వేయాలి. దీన్ని స్టవ్ మీద నుంచి దించి ఎనిమిది నుంచి పది గంటలపాటు పక్కన పెట్టేయాలి. ఇలా చేయడం వల్ల గులాబీరేకలు పూర్తిగా నానిపోతాయి. తర్వాత వాటిని వడకట్టేయాలి. దీంట్లో టీ బ్యాగులు వేసి మరిగించాలి. ఐదు నిమిషాల తర్వాత వాటిని తీసి తేనె, గులాబీనీరు వేసి బాగా కలపాలి. పాలతో కూడా దీన్ని తయారుచేయొచ్చు.
దీనిలో ఎక్కువగా ఉండే విటమిన్-సి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. తరచూ దగ్గూ, జలుబు బారినపడకుండా చేస్తుంది. ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
శంఖుపుష్పాలతో
కావాల్సినవి:శంఖుపుష్పాల రేకలు - అరకప్పు, తేనె- టేబుల్‌స్పూన్, నిమ్మచెక్క- ఒకటి, నీళ్లు- రెండు కప్పులు.
తయారీ: నీళ్లను మరిగించి అందులో శంఖుపుష్పాల రేకలను వేయాలి. తక్కువ మంట మీద కాసేపు మరిగిస్తే రంగు దిగుతుంది. ఈ నీళ్లలో తేనె కలిపితే తేనీరు సిద్ధం అవుతుంది. తర్వాత నిమ్మరసం పిండుకుని వేడిగా తాగేయాలి. అలాగే కొబ్బరినీళ్లు, ఐస్‌క్యూబ్స్ వేసి దీన్ని చల్లగానూ తయారుచేసుకుని తాగొచ్చు.