తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

తరచూ ఛాతీలో మంట..? అయితే ఈ వంటింటి చిట్కా ట్రై చేయండి! - Relieve chest inflammation with curd

మీకు తరచూ ఛాతీలో మంట వేధిస్తుందా.. అయితే వంటింట్లో ఉండే వీటిని ఓసారి ట్రై చేసి చూడండి. సహజ ఉపశమనం లభిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తరచూ ఛాతీలో నొప్పా..? అయితే ఈ వంటింటి చిట్కా ట్రై చేయండి..!
తరచూ ఛాతీలో నొప్పా..? అయితే ఈ వంటింటి చిట్కా ట్రై చేయండి..!

By

Published : Jun 4, 2022, 4:56 AM IST

Updated : Jun 4, 2022, 6:38 AM IST

కొందరికి తరచూ ఛాతీలో మంట వేధిస్తుంటుంది. ఈసీజీ వంటి పరీక్షలు చేసినా.. గుండె మామూలుగానే ఉంటుంది. ఎలాంటి సమస్య ఉండదు. అయినా నొప్పి, మంట వస్తూనే ఉంటాయి. దీనికి కారణం జీర్ణాశయంలోని రసాలు గొంతులోకి ఎగదన్నుకు రావటం. ఇలాంటి వారు రోజూ పరగడుపున రెండు చెంచాల పెరుగు తిని చూడండి. ఇది ఛాతీలో మంట తగ్గటానికి తోడ్పడుతుంది. అలాగే రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగాలి. భోజనం చేసిన వెంటనే పడుకోవద్దు. కనీసం గంట సేపైనా ఆగాలి.

కొన్ని రకాల ఆహార పదార్థాలూ ఛాతీలో మంట, నొప్పిని ప్రేరేపించొచ్చు. మరీ ఎక్కువగా కారం, మసాలాలు తినకూడదు. వేపుళ్లు తగ్గించాలి. రోజూ వేళకు భోజనం చేయాలి. ఆహారాన్ని నెమ్మదిగా, పూర్తిగా నమిలి తినాలి. గబగబా మింగకూడదు. కూల్‌డ్రింకులు, కాఫీ, టీలోని కెఫీన్‌ సైతం ఛాతీ మంటను తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్త అవసరం.

Last Updated : Jun 4, 2022, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details