ఉన్నట్టుండి భారీగా బరువు తగ్గిపోతున్నారనిపిస్తే.. శ్రమలేకుండా బరువు తగ్గిపోతున్నామని ఆనందించకండి. ఎందుకంటే ఇది మధుమేహం తొలి లక్షణం కావొచ్చు అంటున్నారు నిపుణులు. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
ఎందుకు తగ్గుతారు...?
మన శరీరంలోని ప్రతి కణానికీ శక్తి అవసరం. ఇది మనం తిన్న ఆహారంలోని గ్లూకోజు నుంచి లభిస్తుంది. కణాల్లోకి గ్లూకోజు చేరుకునేలా చూడటంలో ఇన్సులిన్ హార్మోన్ కీలకపాత్ర పోషిస్తుంది. అయితే మధుమేహుల్లో ఇన్సులిన్ అంత సమర్థంగా పనిచేయదు. దీంతో కణాల్లోకి గ్లూకోజు చేరుకోవటం తగ్గుతుంది. ఫలితంగా రక్తంలో గ్లూకోజు స్థాయులు పెరుగుతాయి.