Different Types of Rice Health Benefits : బియ్యం అనగానే మనందరికీ తెలిసింది తెల్ల రంగులో ఉండేవి మాత్రమే. బ్రౌన్ రైస్ ఈ మధ్యనే ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ.. ఇవి రెండూ కాకుండా రెడ్ రైస్ కూడా ఉన్నాయి. మరి.. ఈ రెడ్ రైస్ ప్రత్యేకత ఏంటి..? వైట్, బ్రౌన్(Brown Rice) కన్నా ఇవి మేలైనవా? ఏ విధమైన ప్రయోజనాలు పొందవచ్చు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వైట్ రైస్ : రైస్ మిల్లులో వడ్లు బియ్యంగా మారుస్తున్నప్పుడు పాలిష్ చేస్తారు. అందుకే బియ్యం తెల్లగా వస్తాయి. ప్రాసెసింగ్ వల్ల పోషకాలు కాస్త తగ్గుతాయి. కానీ.. శక్తి మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇందులో అధిక కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ రైస్ వెంటనే ఎనర్జీ అందిస్తాయి. ప్రాసెసింగ్ టైమ్‌లో ఈ బియ్యాన్ని ఎక్కువ పాలిష్ చేయడం వల్ల ఫైటిక్ యాసిడ్‌తోపాటు థయామిన్ కంటెంట్ కూడా తక్కువగా ఉంటుంది. థయామిన్నే విటమిన్ B1 అంటారు. ఇందులోని అదనపు క్యాలరీస్ వల్ల శారీరక శ్రమ చేయని వారిలో.. ఊబకాయం, మధుమేహం వంటివి వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
బ్రౌన్ రైస్ : ధాన్యం నుంచి పొట్టును వేరు చేసిన తర్వాత ఉండే బియ్యాన్నే బ్రౌన్ రైస్ అంటారు. వీటిని పాలిష్ చేయరు. దీంతో బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. అందుకే అలా పిలుస్తారు. ఈ రైస్ తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రాసెస్ చేయరు కాబట్టి.. న్యూట్రియంట్స్ ఇందులో ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇక బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం(43 mg) నిండి ఉంటుంది. ఇది మైగ్రేన్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట.
గోరువెచ్చని నీరు తాగే అలవాటుందా? లేదా? - అయితే తప్పకుండా చదవండి!