Raw Turmeric Health Benefits : పసుపు అనేది ప్రతి భారతీయ వంటింట్లో కనిపించే పదార్థం. ఇది లేనిదే ఏ కూరలూ వండరు. పసుపు మన కూరల్లో రుచిని పెంచడమే కాకుండా.. దెబ్బలు తగిలినప్పుడు రక్త స్రావాన్ని ఆపడానికీ పనిచేస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలనూ అందిస్తుంది. ఈ పసుపును తింటారని తెలుసు. కానీ పచ్చి పసుపును కూడా తింటారని మీకు తెలుసా ? ఈ పచ్చి పసుపును తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Health Benefits Of Raw Turmeric : ఈ పచ్చి పసుపును మీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా సులభం. దీన్ని తీసుకోవడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది. కానీ.. తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. అధిక వినియోగంతో కొన్ని దుష్పభావాలుంటాయి. అందుకే పచ్చి పసుపు తీసుకునే ముందు ఆరోగ్య నిపుణుల్ని సంప్రదించడం అవసరం. నల్ల మిరియాలతో కలిపి, పసుపు తినడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఇప్పుడు పచ్చి పసుపు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.
1. యాంటీ ఇన్ఫ్లమేటరీ
Turmeric Anti Inflammatory Properties : పసుపులో క్రియాశీల సమ్మేళమైన కర్కుమిన్ అసాధారణమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. దీర్ఘకాలికంగా మంటతో బాధపడేవారు పచ్చి పసుపు తీసుకోవడం వల్ల ఆ బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు. మీ రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు మూలమైన దీర్ఘకాలిక మంటను ఎదుర్కోవడంలో ఇది సహాయపడుతుంది.
2. రోగనిరోధక వ్యవస్థ మెరుగుదల
Turmeric Immunity Booster : పచ్చి పసుపులో ఉన్న వివిధ సమ్మేళనాలు మన రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. దీని వల్ల ఆయా కాలాల్లో వచ్చే అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలను నివారించే సామర్థ్యాన్ని మెరుగుపడుతుంది. పచ్చి పసుపును రెగ్యులర్గా తినటం వల్ల ఓవరాల్గా మన శరీర సహజ రక్షణ బలోపేతమవుతుంది.