Raw Honey Health Benefits In Telugu :రోగనిరోధకశక్తి పెరగడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. ఇందులో హానికారక బ్యాక్టీరియాను అడ్డుకునే గుణాలు ఉంటాయి. అయితే చాలా మంది ప్యాకేజ్డ్ తేనె వాడుతుంటారు. తేనెను ప్యూరిఫై చేసినప్పుడు, వెలుగు తగిలినప్పుడు అందులోని పుప్పొడి దెబ్బతింటుంది. ఎక్కువ పోషకాలు ఉండేది ఇందులోనే. అందువల్ల దీని నుంచి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే ముడి తేనె అయితేనే మేలు.
ముడి తేనె వల్ల కలిగే ప్రయోజనాలు..
- ముడి తేనెలో ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్, ఆస్కార్బిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- ముడి తేనె మధుమేహం నుంచి రక్షణ అందిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
- తేనెలో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్లూకోజ్ ఆక్సిడేస్ (glucose oxidase) ఉంటాయి. దీంతోపాటు తేనె తక్కువ pH స్థాయిని కలిగి ఉంటుంది. ఇది హానికరమైన బ్యాక్టీరియా, శిలీంధ్రాలను నాశనం చేస్తుంది.
- మనుకా తేనె (ఒక రకమైన ముడి తేనె) E. coli, S. aureus, H. pylori వంటి సాధారణ వ్యాధికారకాలను చంపగలదని ఓ పరిశోధనలో తేలింది.
- తేనెలో యాంటీవైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయని కూడా కొన్ని పరిశోధనలు వివరించాయి.
- కొన్ని ఓవర్-ది-కౌంటర్ (OTC) దగ్గు మందుల కంటే తేనె ప్రభావవంతంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
- కొన్ని అధ్యయనాల ప్రకారం.. ముడి తేనె జీర్ణక్రియపై మంచి ప్రభావం చూపుతుంది.
- కాల్షియం, ఐరన్, సోడియం, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం వంటి ఖనిజ లవణాలతో పాటు విటమిన్ సి, విటమిన్ బి వంటి విటమిన్లు, ప్రొటీన్లు కూడా ఉంటాయి.