Rash On Neck From Gold Necklace :మెడపై దద్దుర్లు వస్తున్నాయని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం అనేక క్రీములను వాడుతూ ఉంటారు. అయినా ఎలాంటి లాభం ఉండకపోవడం వల్ల తగ్గించుకోవడం తెలియక ఆందోళన పడుతూ ఉంటారు. ఎన్ని క్రీములు వాడినా సరే దద్దుర్లు అనేవి పోవు. మెడపై దద్దుర్లు ఏర్పడటం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా బయటకు కనిపించడం వల్ల అందవికారంగా కనిపిస్తుంది.
మెడపై దద్దుర్లు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంశపార్యపరంగా కూడా ఈ దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఊబకాయం, శరీరంపై ఎండ ఎక్కువగా పడటం, చెమట, ఫంగస్ ఇన్ఫెక్షన్లు లాంటివి కూడా మెడపై దద్దుర్లు రావడానికి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. మెడపై దద్దుర్లు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారు ఆభరణాలు వేసుకుంటున్నారా?
Skin Irritation On Neck From Necklace :సాధారణంగా మెడపై దద్దుర్లు ఆడవాళ్లలో ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఆడవాళ్లు మెడలో బంగారు ఆభరణాలు ధరిస్తుంటారు. అయితే అలా బంగారం వేసుకున్నప్పుడు మెడ వెనుక చర్మంపై అలర్జీ వల్ల దద్దుర్లు ఏర్పడతాయి.
చర్మం నల్లగా మారుతుందా?
Rashes Side Effects : మెడపై దద్దుర్లు రావడం వల్ల అక్కడ చర్మం నల్లగా మారిపోయి దురదగా అనిపిస్తూ ఉంటుంది. దీని వల్ల చర్మం మందంగా తయారవ్వడం వల్ల చికాకుగా అనిపిస్తూ ఉంటుంది. దీంతో చాలామంది మెడికల్ షాపుకు వెళ్లి క్రీములు తెచ్చుకొని రాసుకుంటూ ఉంటారు. కానీ దాని వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని వైద్యులు సూచిస్తున్నారు. దద్దుర్లు రావడానికి అనేక కారణాలు ఉంటాయని, ముందు వాటిని అదుపులో పెట్టుకోవడం వల్ల దద్దుర్లను సులువుగా నివారించుకోవచ్చని చెబుతున్నారు.
ఊబకాయం వల్ల దద్దుర్లు..
Skin Rashes Obesity : చాలామంది అధిక బరువు కలిగి ఉండి ఊబకాయంతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారికి మెడపై దద్దుర్లు వచ్చే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో క్రీములు వాడటం వల్ల మాత్రమే తగ్గించుకునే అవకాశం ఉండదు. క్రీములు వాడుతూనే ఇలాంటివారు వ్యాయామాలు, ఆహార నియామాలు పాటించి బరువు తగ్గించుకోవడం వల్ల దద్దుర్ల సమస్య నుంచి బయటపడవచ్చు.