Radish Leaves Health Benefits: సీజనల్ ఫ్రూట్స్‌లో ఎన్ని పోషకాలు ఉంటాయో.. సీజనల్ కాయగూరల్లో అంతకుమించి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో లభించే ముల్లంగి ఇందుకు నిదర్శనం. అయితే ముల్లంగి అంటే చాలా మంది ఆమడ దూరం పరిగెత్తుతారు. దాన్ని ఆహారంలో భాగం చేసుకోవడానికి అంతగా ఇష్టపడరు. కారణం.. ఇది వెగటుగా ఉండటం ఒకటైతే.. దీని ఆరోగ్య ప్రయోజనాలపై సరైన అవగాహన లేకపోవడం. అయితే కొద్దిమంది మాత్రం ముల్లంగిని.. పచ్చడి, సలాడ్, సాంబార్, పరాటాలు.. ఇలా అన్ని రకాలుగా తింటుంటారు. ఇదిలా ఉంటే.. చాలా మంది ముల్లంగి దుంపలను వంటకు వాడి.. వాటి ఆకులను చెత్తగా భావించి బయటపడేస్తుంటారు. మరి మీరు కూడా ఇలానే చేస్తున్నారా..? అయితే మీరు చాలా ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే. ఎందుకంటే ముల్లంగి దుంప కంటే.. దాని ఆకుల్లోనే ప్రయోజనాలు ఎక్కువ అంటున్నారు నిపుణులు. ఈ ఆకులతో పప్పు, కర్రీ, పరాటా, సలాడ్స్.. ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చంటున్నారు. ఇంతకీ ఈ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇన్సులిన్ సమస్యలు, గుండె జబ్బులు దూరం! బ్రౌన్‌రైస్‌తో ఎన్నో లాభాలు
పోషకాల హౌజ్: ముల్లంగి ఆకులను పోషకాల పవర్హోజ్ అంటుంటారు. ఎందుకంటే ఇందులో చాలా రకాలు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్నాయి.. రక్తహీనతను నివారించడం నుంచి.. షుగర్‌ను కంట్రోల్ చేసేందుకు కావాల్సిన పోషకాలు అన్ని ఇందులో ఉన్నాయి. మరి ముల్లంగి ఆకుల ప్రయోజనాలు ఏంటంటే..
రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది: ప్రస్తుతం షుగర్ సమస్య అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తోంది. కాబట్టి డయాబెటిస్ పేషెంట్స్‌కు ముల్లంగి ఆకులు బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని తెల్లకణాలను పెంచేందుకు పని చేస్తాయి. దీనితో పాటు, ముల్లంగిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి ప్రభావితం కాదు. ఇవి రక్తంలో చక్కెర శోషణను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి. దీనిలోని ఫైబర్.. బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది.
మీరు వాడే బాదంపప్పు మంచిదేనా? ఈ చిట్కాలతో చెక్ చేయండి!
రక్తాన్ని శుభ్రంగా ఉంచుతుంది:శరీరంలో రక్తాన్ని శుభ్రంగా ఉంచేందుకు ముల్లంగి ఆకులు ఉపయోగపడతాయి. అంతేకాకుండా.. ముల్లంగి ఆకుల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అనిమియా కారణంగా బాధపడేవారు.. వారి డైట్లో ముల్లంగి ఆకులు కచ్చితంగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా చర్మ సంబంధిత వ్యాధులైన దద్దుర్లు, దురదలు, మొటిమలు.. మొదలైన వాటిని నివారిస్తుంది. ఇది స్కర్వీని నివారించడంలో కూడా సహాయపడుతుంది.